Top News

Sanitation Work in BNS | బాన్సువాడలో విడతల వారీగా ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు

బాన్సువాడలో విడతల వారీగా ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు  

18వ వార్డులో డ్రైనేజీల పూడిక తొలగింపు  

13వ వార్డులో సీసీ రోడ్లపై నిలిచిన వర్షపు నీటి సమస్య పరిశీలన  

ఆగస్టు 3 వరకు అన్ని వార్డుల్లో పారిశుధ్య పనులు: కమిషనర్ గంగాధర్  

బాన్సువాడ, తెలంగాణ డైలీ న్యూస్:  

బాన్సువాడ పురపాలక సంఘం పరిధిలోని 19 వార్డుల్లో వర్షాకాలం దృష్ట్యా విడతల వారీగా ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పురపాలక సంఘ కమిషనర్ గోపు గంగాధర్ తెలిపారు.  

ఇందులో భాగంగా బుధవారం వార్డు నెం. 18 గౌలిగూడ, కుమ్మరిగల్లిలో పేరుకుపోయిన డ్రైనేజీల్లోని పూడికను పారిశుధ్య కార్మికులచే శుభ్రపరిచారు. కాలనీలో అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీలను శుభ్రపరిచి మురికి నీరు ప్రవహించేలా తగు చర్యలు తీసుకున్నారు. మునుముందు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వర్షపు నీరు రోడ్లపైకి రాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని కమిషనర్ పేర్కొన్నారు.  

ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాన్ని జూన్ 22 నుండి ఆగస్టు 3 వరకు అన్ని వార్డుల్లో నిర్వహిస్తామని తెలిపారు. పట్టణ ప్రజలు ఎక్కడైనా మురికి నీటి ఇబ్బందులు ఉంటే పురపాలక సంఘ కార్యాలయాన్ని సంప్రదించాలని కమిషనర్ గోపు గంగాధర్ సూచించారు.  

ఈ ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమంలో 18వ వార్డు కౌన్సిలర్, వైస్ ఛైర్‌పర్సన్ రేష్మాబేగం ఎజాజ్, కార్యాలయ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.  

అనంతరం వార్డు నెం. 12లో సీసీ రోడ్లపై వర్షపు నీరు నిలిచి ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుండటంతో కమిషనర్ పర్యవేక్షణ చేశారు. నిలబడి ఉన్న వర్షపు నీరు డ్రైనేజీల్లోకి వెళ్లే విధంగా తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. వీరి వెంట 12వ వార్డు కౌన్సిలర్ అంజాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.






Post a Comment

Previous Post Next Post