బాన్సువాడలో జోరుగా SIR ఎన్యూమరేషన్ ఫారం నింపే ప్రక్రియ
నాయకుల పర్యవేక్షణలో తప్పులు లేకుండా వివరాల సేకరణ
తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ: రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, మాజీ DCCB చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ఆదేశాల మేరకు బాన్సువాడలో SIR ఎన్యూమరేషన్ ఫారం నింపే ప్రక్రియ నిరంతరంగా సాగుతోంది.
బూత్ స్థాయిలో పర్యవేక్షణ
బూత్ నెంబర్ 219, 221లో BLO జమీల, వై. నవితలకు సహాయంగా బూత్ ఏజెంట్, 3వ వార్డు కౌన్సిలర్ ఎం.ఏ.ఏ. హకీం, MD మెయిన్ 221 మరియు ఇస్లాంపురా యువ నాయకుడు మొహమ్మద్ ఇక్బాల్ క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు.
BLOలకు సహాయంగా ఉంటూ, ఆఫీసర్లతో సమన్వయం చేస్తూ ఫారాల్లో తప్పులు జరగకుండా ఓటర్లు ఇచ్చిన వివరాలను, మ్యాపింగ్ అయిన వివరాలను జాగ్రత్తగా పరిశీలించి నింపుతున్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి, ఆగ్రో చైర్మన్ కాసుల బాలరాజు, మాజీ DCCB చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి సంకల్పం "అర్హుడు ఓటును కాపాడుకుందాం" అని తెలిపారు. SIR ఎన్యూమరేషన్ ఫారం ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రతి ఒక్క నాయకుడు ప్రజలకు అందుబాటులో ఉండి, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే ఉద్దేశంతో పని చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మొహమ్మద్ ఇజాజ్, అలీముద్దీన్ బాబా, వార్డు కౌన్సిలర్ ఎం.ఏ.ఏ. హకీం తదితరులు పాల్గొన్నారు.

Post a Comment