Top News

Students Union | జులై 10న రాష్ట్ర వ్యాప్త విద్యాసంస్థల బంద్‌కు వామపక్ష విద్యార్థి సంఘాల పిలుపు

జులై 10న రాష్ట్ర వ్యాప్త విద్యాసంస్థల బంద్‌కు వామపక్ష విద్యార్థి సంఘాల పిలుపు  

ప్రభుత్వ పాఠశాలల మూసివేత విరమించుకోవాలి, ఫీజు రియంబర్స్‌మెంట్ విడుదల చేయాలి  

విద్యా రంగానికి అధిక నిధులు, మెగా డీఎస్సీ నోటిఫికేషన్ డిమాండ్  

కామారెడ్డి, తెలంగాణ డైలీ న్యూస్:  

విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ 2026 జూలై 10న తెలంగాణ రాష్ట్ర వ్యాప్త విద్యాసంస్థల బంద్‌ను జయప్రదం చేయాలని వామపక్ష విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది.  

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో వామపక్ష విద్యార్థి సంఘ నాయకుల ముఖ్య సమావేశం నిర్వహించి మీడియాతో మాట్లాడారు. జూలై 10న జరిగే విద్యాసంస్థల బంద్‌లో విద్యార్థులు, ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు, ప్రజాస్వామికవాదులు, అన్ని వర్గాల ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.  

ప్రధాన డిమాండ్లు  

1. తెలంగాణ రాష్ట్రంలో 27 వేల ప్రభుత్వ పాఠశాలల మూసివేతను విరమించుకోవాలి, ప్రభుత్వ విద్య వ్యవస్థను బలోపేతం చేయాలి.  

2. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజులను నియంత్రిస్తూ సమగ్ర చట్టం రూపొందించాలి.  

3. పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్‌మెంట్, బెస్ట్ అవైలబుల్ స్కీం బకాయిలను తక్షణమే విడుదల చేయాలి.  

4. విద్యా హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి.  

5. ప్రభుత్వ నియమ, నిబంధనలు పాటించని ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలను మూసివేయాలి.  

6. విద్యా రంగానికి అధిక నిధులు కేటాయించాలి.  

7. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వేసి ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను శాశ్వత ప్రతిపాదికన భర్తీ చేయాలి.  

8. ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక వసతులు కల్పించాలి.  

ఈ కార్యక్రమంలో పిడిఎస్యు రాష్ట్ర కార్యదర్శి జి సురేష్, ఏఐఎఫ్డిఎస్ రాష్ట్ర కార్యదర్శి జబ్బర్, ఏఐఎస్ఎఫ్ కామారెడ్డి ఏరియా అధ్యక్ష కార్యదర్శులు శివ, సంపత్, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు నితిన్, ఏఐఎస్బి జిల్లా నాయకులు నిఖిల్ గౌడ్, నాయకులు రోహిత్, పిడిఎస్యు జిల్లా నాయకులు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post