Top News

Submit SIR Forms | ఎన్యూమరేషన్ ఫారం త్వరగా BLO కు సబ్మిట్ చేయండి

 

ఎన్యూమరేషన్ ఫారం త్వరగా BLO కు సబ్మిట్ చేయండి

ఎన్యూమరేషన్ ఫారం పూర్తి చేయడంలో సహాయం  

సీనియర్ కాంగ్రెస్ నేత మహ్మద్ ఎజాజ్ 

బాన్సువాడ: SIR ప్రక్రియలో భాగంగా ప్రతి ఓటర్ ఎన్యూమరేషన్ ఫారం నింపి బూత్ లెవెల్ అధికారికి త్వరగా సబ్మిట్ చేయాలని  కాంగ్రెస్  సీనియర్ నాయకులు మొహమ్మద్ ఎజాజ్ విజ్ఞప్తి చేశారు. చివరి తేదీ వరకు వేచి చూడవద్దని, ఆలస్యం చేస్తే సర్వర్ బిజీ అయ్యే అవకాశం ఉందని, ఫారం ఇవ్వకుంటే ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

ఎన్యూమరేషన్ ఫారం పూర్తి చేయడంలో సహాయం  

రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, మాజీ DCCB చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి సంకల్పం మేరకు ప్రతి ఓటర్ వద్దకు SIR ఎన్యూమరేషన్ ఫారం అందించి ఫారం నింపడంలో సహాయం అందించనున్నారు.

బూత్ నెంబర్ 219, 220, 221 లెవెల్ ఆఫీసర్లు జమీల, వనజ, వై నవిత లకు సహాయంగా సీనియర్ నాయకులు మొహమ్మద్ ఎజాజ్, బూత్ ఏజెంట్ యం ఏ హకీమ్ 219 BLA 3వ వార్డు కౌన్సిలర్, MD మెయిన్ BLA 221 BLA 220 అలీమ్ ఉద్దీన్ బాబా, ఇస్లాంపురా యువ నాయకుడు మొహమ్మద్ ఇక్బాల్ ఓటర్ల ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరించి ఎన్యూమరేషన్ ఫారం నింపడంలో సహాయం చేస్తున్నారు.


ఓటర్లకు సీనియర్ నాయకుల విజ్ఞప్తి  

ఈ సందర్భంగా సీనియర్ నాయకులు మొహమ్మద్ ఇజాజ్ బాన్సువాడ పట్టణ ఓటర్లకు విజ్ఞప్తి చేస్తూ ఎన్యూమరేషన్ ఫారం నింపిన వెంటనే సంబంధిత BLO కు తిరిగి సబ్మిట్ చేయాలని కోరారు. చివరి తేదీ వరకు ఆలస్యం చేయవద్దని, ఎన్యూమరేషన్ ఫారం సబ్మిట్ చేయకుంటే ఓటు హక్కు కోల్పోయే అవకాశం ఉంటుందని తెలిపారు.

Post a Comment

Previous Post Next Post