Top News

Thieves Arrested | డీజే సౌండ్ సామగ్రి, టాటా ఏస్ వాహనం చోరీ కేసు ఛేదన

డీజే సౌండ్ సామగ్రి, టాటా ఏస్ వాహనం చోరీ కేసు ఛేదన  

బీబీపేట్ పోలీసులు ముగ్గురు నిందితుల అరెస్టు

కామారెడ్డి: తుజాల్పూర్ గ్రామంలో జరిగిన డీజే సౌండ్ సామగ్రి చోరీ కేసును బీబీపేట్ పోలీసులు వేగంగా ఛేదించారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, చోరీకి గురైన టాటా ఏస్ మినీ గూడ్స్ క్యారియర్ వాహనంతో పాటు డీజే సౌండ్ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.  

తుజాల్పూర్ గ్రామానికి చెందిన తాడేం శ్రీధర్ భూలక్ష్మి టెంట్ హౌస్ నిర్వహిస్తున్నారు. తేది 12.07.2026 రాత్రి 10:30 గంటలకు తన టాటా ఏస్ వాహనం నెం. AP 20 TB 2717ను షాప్ ముందు పార్క్ చేసి షాప్‌కు తాళం వేసి ఇంటికి వెళ్లారు.  

మరుసటి రోజు 13.07.2026 ఉదయం 6:30 గంటలకు వచ్చి చూడగా షాప్ తాళాలు పగులగొట్టి ఉండటం, టాటా ఏస్ వాహనం కనిపించకపోవడం గమనించారు. డీజే సౌండ్ సామగ్రి కూడా చోరీకి గురైంది. బాధితుడు బీబీపేట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

అరెస్టు ఎలా జరిగింది  

కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్ ఆదేశాల మేరకు, బిక్నూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నరేష్ పర్యవేక్షణలో, బీబీపేట్ ఎస్‌హెచ్‌ఓ కొండా విజయ్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపట్టాయి.  

సీసీ కెమెరాల ఫుటేజ్, సాంకేతిక ఆధారాలు, గ్రామస్తుల సమాచారం ఆధారంగా విచారణ కొనసాగించారు. 15.07.2026 నాడు సిరిగాడ బ్రిడ్జి వద్ద వాహనాల తనిఖీల సమయంలో ఒక టాటా ఏస్ వాహనం పోలీసులను చూసి వెనుదిరిగేందుకు ప్రయత్నించింది. అనుమానం రావడంతో వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా అందులో డీజే సౌండ్ సామగ్రితో పాటు ముగ్గురు వ్యక్తులు ఉన్నారు.  

విచారణలో 12.07.2026 నాడు తుజాల్పూర్ గ్రామంలో టాటా ఏస్ వాహనం డీజే సౌండ్ సామగ్రిని దొంగతనం చేసినట్లు అంగీకరించారు. సామగ్రిని తమ గ్రామానికి తీసుకెళ్లి దాచినట్లు తెలిపారు.

ఇతర చోరీలు  

విచారణలో పెద్ద నిజాంపేట్, భూంపల్లి, దిలాల్పూర్, రామాయంపేట్ ప్రాంతాల్లో కూడా డీజే సౌండ్ సామగ్రి చోరీలకు పాల్పడినట్లు నిందితులు వెల్లడించారు. దొంగిలించిన సామగ్రిని సిరిసిల్లలో విక్రయించేందుకు తీసుకెళ్తున్న సమయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నిందితుల వివరాలు  

అమ్మొళ్ల బ్రహ్మం, తండ్రి జితేందర్, నివాసం దొంగల ధర్మారం, శివాయిపల్లి గ్రామం, రామాయంపేట్ మండలం  

ముగ్గురిలో ఒకరు మేజర్, ఇద్దరు బాల నేరస్థులు. మేజర్ పై చట్టప్రకారం కేసు నమోదు చేయగా, బాల నేరస్థులను జువెనైల్ జస్టిస్ చట్టం 2015 నిబంధనల ప్రకారం జువెనైల్ జస్టిస్ బోర్డు ఎదుట హాజరుపరిచారు.టాటా ఏస్ మినీ గూడ్స్ క్యారియర్ వాహనం , డీజే సౌండ్ సామగ్రి స్వాదినం చేసుకున్నారు.

జిల్లా ఎస్పీ అభినందనలు  

ఇట్టి కేసును అత్యంత చాకచక్యంగా దర్యాప్తు చేసి తక్కువ సమయంలో నిందితులను అరెస్టు చేసి ఆస్తిని స్వాధీనం చేసుకున్న బీబీపేట్ ఎస్‌హెచ్‌ఓ కొండా విజయ్, బిక్నూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నరేష్, కేసు ఛేదనలో పాల్గొన్న పోలీసు అధికారులను సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.

Post a Comment

Previous Post Next Post