బిచ్కుంద షాప్ చోరీ కేసు ఛేదన
ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్
దొంగిలించిన మొబైల్ ఫోన్లు, బైక్ స్వాధీనం
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసుల విజ్ఞప్తి
బిచ్కుంద : బిచ్కుంద గ్రామంలోని షాప్ లో జరిగిన చోరీ కేసును బిచ్కుంద పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్ట్ చేసి, దొంగిలించిన సెల్ ఫోన్లు, బైక్ ను స్వాధీనం చేసుకున్నారు.
ఫిర్యాదు, కేసు నమోదు
బిచ్కుంద పట్టణానికి చెందిన వ్యాపారి షేక్ షాదుల్ తన రాయల్ వెల్డింగ్ షాప్ కు తాళం వేసి వెళ్లారు. 15.07.2026 రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు షట్టర్ తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించి సుమారు రూ.10,000/- విలువైన వివో E-30 మొబైల్ ఫోన్ ను దొంగిలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు బిచ్కుంద పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
వాహన తనిఖీల్లో అనుమానితుల పట్టు
దర్యాప్తులో భాగంగా బిచ్కుంద ఎస్ఐ జి. రాజు మరియు సిబ్బంది అయ్యప్ప టెంపుల్ ప్రాంతంలో వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో మోటార్ సైకిల్ పై అనుమానాస్పదంగా వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను ఆపి విచారించారు. వారు పారిపోవడానికి ప్రయత్నించగా అదుపులోకి తీసుకుని విచారించగా చోరీకి పాల్పడినట్లు ఒప్పుకున్నారు.
అరెస్ట్ అయిన నిందితులు
A-1) కుంచెపు గౌరి అలియాస్ రవి, వయస్సు 32 సంవత్సరాలు. నివాసం మియాపూర్, హైదరాబాద్. స్వస్థలం కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఇతనిపై గతంలో షాబాద్, చౌదరిగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనం కేసులు ఉన్నాయి.
A-2) మురళి ప్రధాన్, వయస్సు 32 సంవత్సరాలు. నివాసం జాజ్ పూర్ జిల్లా, ఒడిశా రాష్ట్రం. ఇతనిపై గతంలో మెదక్ జిల్లా చేగుంట పోలీస్ స్టేషన్ పరిధిలో నేర చరిత్ర ఉంది.
స్వాధీనం చేసుకున్న సొత్తు
నిందితుల వద్ద నుండి బాధితుడికి చెందిన 1 వివో మొబైల్ ఫోన్, ఇతర ప్రాంతాల్లో చోరీ చేసిన 3 స్మార్ట్ ఫోన్లు, ఒక వన్ ప్లస్, ఒక రియల్ మీ, ఒక శామ్ సంగ్, మరియు దొంగతనాలకు ఉపయోగించిన హోండా షైన్ మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకున్నారు.
ప్రజలకు పోలీసుల విజ్ఞప్తి
ప్రజలు తమ గ్రామాలు, కాలనీలలో కొత్త వ్యక్తులు లేదా అనుమానాస్పదంగా సంచరిస్తున్న వారిని గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి. రాత్రి సమయంలో ఇళ్లు, దుకాణాలకు బలమైన తాళాలు వేసుకోవడంతో పాటు వీలైనంత వరకు సిసిటివి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. ఏదైనా అనుమానాస్పద పరిస్థితి గమనించినా, అత్యవసర సహాయం అవసరమైనా వెంటనే డయల్-100 లేదా సమీప పోలీస్ స్టేషన్ ను సంప్రదించాలని బిచ్కుంద పోలీసులు కోరారు.

Post a Comment