Top News

Disha Committee Meeting | దిశా సమావేశంలో జిల్లా అభివృద్ధి పనులపై సమగ్ర సమీక్ష

దిశా సమావేశంలో జిల్లా అభివృద్ధి పనులపై సమగ్ర సమీక్ష  

ప్రభుత్వ పథకాల అమలులో సమన్వయం అవసరం  

రైతులు, తాగునీరు, రహదారులు, విద్యకు ప్రాధాన్యత  

పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశం

కామారెడ్డి: ప్రభుత్వ పథకాల అమలులో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడు, జిల్లా దిశా కమిటీ చైర్మన్ సురేష్ షెట్కర్ అన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో దిశ సమావేశం నిర్వహించారు.

సమావేశంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు  

ఈ సమావేశంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

పథకాల అమలుపై ఎంపీ సూచనలు  

సురేష్ షెట్కర్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి లబ్ధిదారునికి సకాలంలో అందించేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అభివృద్ధి పనులను వేగవంతం చేసి ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని ఆదేశించారు.

వ్యవసాయం, రహదారులు, విద్యపై సమీక్ష  

వ్యవసాయం, నీటిపారుదల, రహదారులు, రహదారి భద్రత, బ్యాంకింగ్, విద్య, గ్రామీణాభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై శాఖల వారీగా సమీక్షించారు. పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. రైతులకు కేంద్ర ప్రభుత్వ పథకాలపై విస్తృత అవగాహన కల్పించి, కిసాన్ క్రెడిట్ కార్డులు, పంట బీమా, ఇతర ఆర్థిక సహాయ పథకాల అమలును మరింత వేగవంతం చేయాలని పేర్కొన్నారు.

రహదారి భద్రత, తాగునీటిపై దృష్టి  

జాతీయ రహదారులపై రహదారి ప్రమాదాల నివారణకు భద్రతా చర్యలను పటిష్టం చేయాలని, తాగునీరు, సాగునీటి సౌకర్యాల మెరుగుదలకు ప్రాధాన్యత ఇవ్వాలని సంబంధిత శాఖలను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రతిపాదనలు సిద్ధం చేసి, అందుబాటులో ఉన్న నిధులను సమర్థంగా వినియోగించాలని సూచించారు.

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, కలెక్టర్ ప్రసంగం  

ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులకు ఆరుతడి పంటలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, తాగునీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉపాధి హామీ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ప్రతి ఒక్కరికి ఉపాధి లభించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని, ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను సంబంధిత అధికారులు కల్పించాలని కోరారు.

జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ సమావేశంలో సభ్యులు చేసిన సూచనలను సంబంధిత శాఖలు కార్యాచరణ ప్రణాళికతో అమలు చేయాలని, శాఖల మధ్య సమన్వయం పెంచి అభివృద్ధి కార్యక్రమాలను నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, మున్సిపల్ చైర్మన్ ఇప్ప ఉమారాణి, అదనపు కలెక్టర్ విక్టర్, అదనపు స్థానిక సంస్థల కలెక్టర్ ఎన్ వై గిరి, డిఆర్డిఎ దామోదర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.






Post a Comment

Previous Post Next Post