నిజామాబాద్ అదనపు కలెక్టర్ గా రాజా గౌడ్ నియామకం
జగిత్యాల నుండి బదిలీ
బోధన్, బాన్సువాడ ఆర్డీఓగా అనుభవం
రెవెన్యూ, భూ సమస్యల పరిష్కారంపై దృష్టి
నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాకు కొత్త అదనపు కలెక్టర్ (రెవెన్యూ) గా రాజా గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) గా విధులు నిర్వహిస్తున్న రాజా గౌడ్ ను నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) గా ప్రభుత్వం బదిలీ చేసింది. త్వరలోనే ఆయన నిజామాబాద్ లో కొత్త బాధ్యతలు స్వీకరించనున్నారు.
బోధన్, బాన్సువాడ ఆర్డీఓగా అనుభవం
రాజా గౌడ్ గతంలో బాన్సువాడ ఆర్డీఓ గా సుదీర్ఘ కాలం పని చేశారు. ఆయన ఇక్కడి నాయకులు, ప్రజలకు సుపరిచితులు. అనంతరం బోధన్ ఆర్డీఓగా బదిలీ అయ్యారు. దీంతో నిజామాబాద్ జిల్లా భౌగోళిక పరిస్థితులు, రెవెన్యూ వ్యవస్థపై ఆయనకు ఇప్పటికే పూర్తి అవగాహన ఉంది. గతంలో జిల్లాలో పనిచేసిన అనుభవం ప్రస్తుత బాధ్యతల్లో ఉపయోగపడుతుందని అధికారులు, సిబ్బంది భావిస్తున్నారు. నిజామాబాద్ అదనపు కలెక్టర్ గా రాజా గౌడ్ రెవెన్యూ పరిపాలన, భూ సంబంధిత అంశాలు, ప్రజల నుండి వచ్చే సమస్యల పరిష్కారంలో కీలకంగా వ్యవహరించనున్నారు.
ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు రాజా గౌడ్ త్వరలోనే నిజామాబాద్ లో బాధ్యతలు స్వీకరించి విధుల్లో చేరనున్నారు.
జగిత్యాల అదనపు కలెక్టర్ రాజా గౌడ్ ను నిజామాబాద్ అదనపు కలెక్టర్ (రెవెన్యూ) గా ప్రభుత్వం నియమించడంతో జిల్లాలోని అధికార యంత్రాంగంలో కొత్త ఉత్సాహం నెలకొంది.


Post a Comment