Top News

Bike Thieves | బైక్ దొంగల ముఠా అరెస్ట్

 

బైక్ దొంగల ముఠా అరెస్ట్ – ఇద్దరు నిందితులు రిమాండ్‌కు తరలింపు

మద్నూర్ :మద్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను మద్నూర్ ఎస్‌ఐ ఏ. మోహన్ రెడ్డి మరియు పోలీస్ సిబ్బంది అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

కేసు వివరాలు:  

మహారాష్ట్రలోని దేగ్లూర్‌కు చెందిన  

1. జాదవ్ అజయ్

2. షేక్ అయాన్  

జల్సాలకు అలవాటు పడి డబ్బు కోసం చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. గతంలో మహారాష్ట్రలోని చాకుర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా చోరీలకు పాల్పడినట్లు విచారణలో తేలింది.

నిందితులు తెలంగాణలోని మద్నూర్, డోంగ్లి మండలాల్లో ద్విచక్ర వాహనాలు చోరీ చేయాలని ముందస్తుగా ప్రణాళిక వేసుకున్నారు. 

తేదీ 28-07-2026 తెల్లవారుజామున సుమారు 04:00 గంటలకు డోంగ్లి గ్రామంలో జాదవ్ దీపక్ ఇంటి కాంపౌండ్ గేట్ తాళం పగలగొట్టి, ఇంటి ఆవరణలో ఉన్న Honda Shine (TS16ET7946) ద్విచక్ర వాహనాన్ని తమ వద్ద ఉన్న పాత తాళంతో చోరీ చేశారు.

అనంతరం అదే వాహనంపై వెళ్తూ మార్గమధ్యంలో హాండేకలూర్ గ్రామంలో దేష్పెట్వర్ గంగాధర్ ఇంటి ముందు ఉన్న Hero HF Deluxe (TS17C4311) ద్విచక్ర వాహనాన్ని కూడా పాత తాళంతో చోరీ చేశారు. రెండు వాహనాలను తీసుకుని భక్తపూర్ రోడ్డు మీదుగా దేగ్లూర్‌కు వెళ్లి తమ ఇళ్ల వద్ద ఉంచుకున్నారు.

పట్టుబడిన తీరు:  

తేదీ 17-08-2026న చోరీ చేసిన రెండు ద్విచక్ర వాహనాలను పిట్లం, బిచ్కుంద ప్రాంతాల్లో విక్రయించేందుకు తీసుకెళ్తుండగా, మద్నూర్ శివారులోని పాత భారత్ పెట్రోల్ బంక్ సమీపంలో మద్నూర్ ఎస్‌ఐ ఏ. మోహన్ రెడ్డి మరియు పోలీస్ సిబ్బంది విఠల్, శ్రావణ్, సంతోష్ కలిసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

స్వాధీనం చేసుకున్న వాహనాలు:  

1. Honda Shine – TS16ET7946  

2. Hero HF Deluxe – TS17C4311  

నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించడం జరిగింది. ఇతర చోరీ కేసుల్లో నిందితుల ప్రమేయంపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన మద్నూర్ ఎస్‌ఐ ఏ. మోహన్ రెడ్డి మరియు పోలీస్ సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.



Post a Comment

Previous Post Next Post