Top News

Best Lab Technician | ఉత్తమ సేవలకు గుర్తింపు

ఉత్తమ సేవలకు గుర్తింపు 

జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న బాన్సువాడ ల్యాబ్ అనాలిస్ట్ షేక్ హిమాయత్

బాన్సువాడ: బాన్సువాడ ఏరియా హాస్పిటల్, MCH హాస్పిటల్‌లో ల్యాబ్ అనాలిస్ట్‌గా విధులు నిర్వహిస్తున్న షేక్ హిమాయత్ ఉత్తమ సేవా అవార్డును అందుకున్నారు.

గత సంవత్సరంలో షేక్ హిమాయత్ ఆధ్వర్యంలోని ల్యాబ్ టీమ్ 3,15,095 పరీక్షలు నిర్వహించి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించింది. విధి నిర్వహణలో చూపిన అంకితభావం, సేవా స్పూర్తికి గుర్తింపుగా ఆగస్టు 15న కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్, ఎమ్మెల్యే మదన్ మోహన్ చేతుల మీదుగా షేక్ హిమాయత్ బెస్ట్ ఎంప్లాయి అవార్డును స్వీకరించారు.

ఈ అవార్డును తన వ్యక్తిగత విజయంగా కాకుండా మొత్తం ల్యాబ్ టీమ్ చేసిన కృషికి దక్కిన గౌరవంగా షేక్ హిమాయత్ పేర్కొన్నారు.

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ల్యాబ్ టీమ్ కీలక పాత్ర పోషిస్తుందని, ఇలాంటి గుర్తింపులు సిబ్బందికి మరింత ప్రోత్సాహాన్ని ఇస్తాయని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

Post a Comment

Previous Post Next Post