టోల్ గేట్ వద్ద విక్రయానికి తరలిస్తుండగా పోలీసులకు చిక్కిన నిందితులు
భిక్నూర్: బిక్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ద్విచక్ర వాహనాల చోరీ కేసును భిక్నూర్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి 3 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
అరేపల్లికి చెందిన రస్మాయి రమేష్ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 13-08-2026 రాత్రి 09:30 గంటలకు భిక్నూర్ టోల్ ప్లాజా వద్ద పార్క్ చేసిన Glamour వాహనం TS16ED9299 మరుసటి రోజు ఉదయం కనిపించకుండా పోయింది. ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
సీసీ కెమెరా ఫుటేజీ, సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేసిన పోలీసులు 17-08-2026న చోరీ చేసిన వాహనాలను హైదరాబాద్‌లో విక్రయించేందుకు తీసుకెళ్తున్న సమయంలో భిక్నూర్ టోల్ గేట్ వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మూడు వాహనాల చోరీకి పాల్పడినట్లు అంగీకరించినట్లు తెలిపారు.
నిందితుల వివరాలు:
1. శివరాత్రి శంకర్, తండ్రి సిద్దరములు, నివాసం శివాయిపల్లి, రాజంపేట మండలం
2. శివరాత్రి కృష్ణ, తండ్రి సిద్దరములు, నివాసం శివాయిపల్లి, రాజంపేట మండలం
విచారణలో నిందితులు భిక్నూర్ టోల్ ప్లాజా వద్ద Passion Plus AP10AP0322, అహ్మద్ కాలేజ్ సమీపంలో గేట్ తాళం పగలగొట్టి Glamour TS16ED9299, అలాగే గతంలో Bajaj Boxer AP29C7122 వాహనాలను చోరీ చేసినట్లు అంగీకరించారు.
పోలీసులు నిందితుల వద్ద నుంచి Passion Plus AP10AP0322, Glamour TS16ED9299, Bajaj Boxer AP29C7122 తో పాటు GIVA కీప్యాడ్ మొబైల్, Redmi మొబైల్, GIONEE మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.ఈ కేసును ఛేదించిన భిక్నూర్ ఎస్‌ఐ ఎస్. అనిల్, సిబ్బందిని కామారెడ్డి ఎస్పీ అభినందించారు.

Post a Comment