బాన్సువాడ నియోజకవర్గంలో ఆషాఢ బోనాల సంబరాల్లో బీజేపీ
ఆలయాల్లో బోనం ఎత్తిన మాజీ ఎంపీ బీబీ పాటిల్
బాన్సువాడ: ఆషాఢ మాసం సందర్భంగా బాన్సువాడ నియోజకవర్గంలో బోనాల పండుగ ఘనంగా జరిగింది. బీజేపీ రాష్ట్ర నేత, మాజీ ఎంపీ బీబీ పాటిల్ వివిధ ఆలయాల్లో పూజలు నిర్వహించి బోనం సమర్పించారు. ఆయన వెంట బీజేపీ రాష్ట్ర నాయకులు పైడిమల్ లక్ష్మి నారాయణ, కొనాల గంగారెడ్డి, తుప్తి ప్రసాద్, కౌన్సిలర్లు పాశం భాస్కర్ రెడ్డి, మహేష్, శ్రీకాంత్, అంబెమ్ సర్పంచ్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.(వీడియోలు 👇)
వివిధ ఆలయాల్లో పూజలు
బీబీ పాటిల్ తొలుత బాన్సువాడ పట్టణ కేంద్రంలోని కోటగల్లి కోటదుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అంబెమ్, రుద్రూర్ గ్రామంలోని పోచమ్మ, మహాలక్ష్మి అమ్మవార్ల ఆలయాలను సందర్శించి బోనం ఎత్తారు.
ఈ సందర్భంగా అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి, రాష్ట్ర ప్రజల సంక్షేమం, సుభిక్షం కోసం ప్రార్థనలు చేశారు.
బోనాల ఉత్సవాల్లో బాన్సువాడ నియోజకవర్గ బీజేపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అమ్మవారి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో బోనాలతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవార్లకు నివేదనలు సమర్పించారు.
ఆషాఢ మాసం సందర్భంగా నిర్వహించే బోనాల పండుగ తెలంగాణ సంస్కృతికి ప్రతీక అని, అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని బీబీ పాటిల్ ఆకాంక్షించారు.






Post a Comment