కోట దుర్గమ్మ బోనాల ఉత్సవాల్లో మున్సిపల్ చైర్‌పర్సన్ కాసుల విజయ బాలరాజ్
అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్న కాసుల రోహిత్
అన్నదాత కోటగిరి రవికుమార్‌కు ఘన సన్మానం
బాన్సువాడ: బాన్సువాడ పట్టణంలోని శ్రీ కోట దుర్గమ్మ ఆలయంలో ఆషాఢ బోనాల మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో బాన్సువాడ మున్సిపల్ చైర్‌పర్సన్ కాసుల విజయ బాలరాజ్ భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.
అమ్మవారికి బోనం సమర్పణ
ఈ సందర్భంగా చైర్‌పర్సన్ కాసుల విజయ బాలరాజ్ తన కుటుంబ సభ్యులతో కలిసి సంప్రదాయబద్ధంగా బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఆశీస్సులు పొందుతూ పట్టణ ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు.
బాన్సువాడ మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుడు కాసుల రోహిత్ కూడా కుటుంబ సమేతంగా బోనాల ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. వీడియో 👇👇
అన్నదాతకు సన్మానం
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆదివారం కోటదుర్గమ్మ ఆలయంలో అన్నదాతగా నిలిచిన కోటగిరి రవికుమార్‌ను మున్సిపల్ చైర్‌పర్సన్ కాసుల విజయ, కో-ఆప్షన్ సభ్యుడు కాసుల రోహిత్, స్థానిక కౌన్సిలర్ రాజశేఖర్ తో కలిసి ఘనంగా సన్మానించారు.


Post a Comment