తగిలేపల్లి వెంకన్న కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం
6 మండలాల కాంగ్రెస్ నాయకుల స్పష్టికరణ
వర్ని, ఆగస్టు 28:
తగిలేపల్లి మాజీ సర్పంచ్ వెంకన్న హత్య ఘటనపై బాన్సువాడ నియోజకవర్గంలోని పొతంగల్, కోటగిరి, రుద్రూర్, వర్ని, చందూర్, మోస్రా మండలాల కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా స్పందించారు.
సోమవారం జరిగిన హత్యను నిరసిస్తూ పోచారం భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో వర్ని చౌరస్తాలో జరిగిన భారీ ధర్నాను తప్పుదోవ పట్టిస్తూ ఏనుగు రవీందర్ రెడ్డి, బాజిరెడ్డి వర్గీయులు విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
బాధిత కుటుంబాన్ని పరామర్శించకుండా, న్యాయం కోసం రోడ్డెక్కిన వారిపై విమర్శలు చేయడం, కేసులు పెట్టడం ఏ న్యాయమని ప్రశ్నించారు.
పోచారం కుటుంబం నాలుగు దశాబ్దాలుగా శాంతి, అభివృద్ధికే కృషి చేసిందని, కరోనా సమయంలో ప్రత్యర్థి పార్టీకి చెందిన నార్ల రత్నకుమార్ కుటుంబానికి కూడా వెంటిలేటర్ బెడ్ ఏర్పాటు చేసి ప్రాణం కాపాడిందని గుర్తుచేశారు.
వెంకన్న కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని, బాన్సువాడలో హత్యా రాజకీయాలకు తావు లేదని 6 మండలాల నాయకులు స్పష్టం చేశారు.

Post a Comment