కామారెడ్డి: దేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను కామారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో అత్యంత వైభవంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు.
కలెక్టరేట్ ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో అధికారులు, సిబ్బంది జాతీయ జెండాకు సెల్యూట్ చేశారు. అనంతరం పోలీస్ గౌరవ వందనాన్ని కలెక్టర్ స్వీకరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, స్వాతంత్ర్యం కోసం త్యాగం చేసిన అమరవీరులను స్మరించుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి పేదవాడికి అందించడమే అసలైన స్వాతంత్ర్య స్ఫూర్తి అని తెలిపారు. జిల్లా అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు, RDOలు, DSO, DPIO, వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది, పోలీస్ అధికారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జాతీయ జెండా ఎగురవేత అనంతరం దేశభక్తి గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. చివరగా మిఠాయిలు పంపిణీ చేశారు.








Post a Comment