కామారెడ్డి ఇందిరా గాంధీ స్టేడియంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
ముఖ్య అతిథిగా ప్రభుత్వ సలహాదారులు వీ. హన్మంత్ రావు
ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు
కామారెడ్డి: దేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరా గాంధీ స్టేడియంలో అత్యంత వైభవంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వెనుకబడిన తరగతుల సంక్షేమ & అభివృద్ధి సలహాదారులు వీ. హన్మంత్ రావు ముఖ్య అతిథిగా హాజరై ఉదయం 9:30 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో హన్మంత్ రావు, జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్, ఎస్పీ రాజేష్ చంద్ర, అదనపు కలెక్టర్లు ఎన్ వై గిరి, విక్టర్పో,లీస్ అధికారులు, ప్రజాప్రతినిధులు జాతీయ జెండాకు సెల్యూట్ చేశారు. అనంతరం పోలీస్ కవాతును ముఖ్య అతిథి పరిశీలించారు.
ఈ సందర్భంగా హన్మంత్ రావు మాట్లాడుతూ, స్వాతంత్ర్యం కోసం త్యాగం చేసిన అమరవీరులను స్మరించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, జిల్లా అభివృద్ధి కార్యక్రమాలపై జిల్లా ప్రజలకు వివరించారు. "ప్రతి పేదవాడి జీవితంలో వెలుగులు నింపడమే నిజమైన స్వాతంత్ర్య స్ఫూర్తి" అని అన్నారు.
ఉత్తమ సేవలకు ప్రశంసా పత్రాలు
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జిల్లాలోని వివిధ శాఖల్లో విశేష సేవలు అందించిన అదనపు కలెక్టర్ వి. విక్టర్, AC(LB) ఎన్.వై.గిరి, DEO మల్లికార్జున్, CPO రఘునందన్ తో సహా 354 మంది అధికారులు, సిబ్బందికి ముఖ్య అతిథి చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందజేశారు. కలెక్టరేట్, RDO కార్యాలయాలు, పోలీస్ శాఖ సిబ్బంది ఈ అవార్డులు అందుకున్నారు.
కార్యక్రమానికి ముందు జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వేడుకల్లో ప్రజాప్రతినిధులు, స్వాతంత్ర్య సమరయోధులు, అధికారులు, విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విద్యార్థులచే దేశభక్తి నృత్యాలు, పాటలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.








Post a Comment