కౌలాస్ నాలా జలాశయానికి వరద పోటు - గేట్లు ఎత్తే అవకాశం
అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక
జుక్కల్: కామారెడ్డి జిల్లాలోని కౌలాస్ నాలా ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. జలాశయం గేట్లు ఏ క్షణమైనా ఎత్తే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు.
ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 458 అడుగులు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 457.60 అడుగులకు చేరుకుందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ఇన్ ఫ్లో పెరుగుతోందన్నారు.
దీంతో మంజీరా పరివాహక ప్రాంత గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో చాటింపు వేయాలని రెవెన్యూ, పోలీసు శాఖలకు సమాచారం ఇచ్చారు.
జలాశయం దిగువకు గొర్రెల కాపరులు, పశువుల కాపరులు, మత్స్యకారులు వెళ్లరాదని అధికారులు విజ్ఞప్తి చేశారు.

Post a Comment