బాన్సువాడ పట్టణంలో మున్సిపల్ కమిషనర్ ఆకస్మిక తనిఖీ
దుకాణాల ముందు చెత్త బుట్టలు, తడి-పొడి చెత్త వేర్వేరుగా ఉంచాలని ఆదేశం
బాన్సువాడ: బాన్సువాడ పట్టణంలో పారిశుధ్య పరిస్థితులను మెరుగుపరిచేందుకు మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా దుకాణ యజమానులతో మాట్లాడుతూ తమ దుకాణాల పరిసరాలను ప్రతిరోజూ పరిశుభ్రంగా ఉంచాలని కోరారు.
పట్టణంలో పారిశుధ్యాన్ని కాపాడటం మున్సిపాలిటీతో పాటు ప్రతి వ్యాపారి, పౌరుడి బాధ్యత అని కమిషనర్ పేర్కొన్నారు. పరిశుభ్రమైన వాతావరణం ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు దుకాణ యజమానులు మున్సిపాలిటీకి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ముఖ్య వీధులు, మార్కెట్ ప్రాంతాల్లోని దుకాణాలను పరిశీలించిన కమిషనర్ దుకాణాల ముందు పేరుకుపోయిన చెత్తాచెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలు, ఆహార వ్యర్థాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆహార పదార్థాలు విక్రయించే దుకాణాల యజమానులు పరిశుభ్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. దుకాణాల ముందు మురుగునీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, డ్రైనేజీ కాలువల్లో చెత్త, ప్లాస్టిక్ కవర్లు తదితర వ్యర్థాలను వేయరాదని సూచించారు. వీడియో 👇
దుకాణాల ముందు చెత్త బుట్టలు, తడి-పొడి చెత్త వేర్వేరుగా ఉంచాలని ఆదేశం
ప్రతి దుకాణం ముందు తగిన చెత్త బుట్టలను ఏర్పాటు చేసుకోవాలని కమిషనర్ సూచించారు. తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా ఉంచి మున్సిపల్ పారిశుధ్య సిబ్బందికి అందజేయాలని తెలిపారు.
నిబంధనలు పాటించని దుకాణాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పారిశుధ్య సిబ్బందితో సమన్వయం చేసుకుని రోజూ చెత్త సేకరణకు సహకరించాలని కోరారు.
“మన దుకాణం – మన బాధ్యత, పరిశుభ్రమైన బాన్సువాడ – మనందరి లక్ష్యం” అని కమిషనర్ పిలుపునిచ్చారు.


Post a Comment