Top News

Prajavani in Mandals | ఇకపై మండల స్థాయిలో ప్రజావాణి

ఇకపై మండల స్థాయిలో ప్రజావాణి 

ఆగస్టు 17 నుంచి  ప్రారంభం 

ప్రతి సోమవారం ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రజల సమస్యల పరిష్కారం: కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

కామారెడ్డి:  జిల్లా ప్రజల సమస్యలను వారి మండల స్థాయిలోనే పరిష్కరించేందుకు ప్రతి సోమవారం మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాలను ఆగస్టు 17వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు.

ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం లేకుండా, ఆయా మండల కేంద్రాల్లోని ఎంపీడీవో కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో దరఖాస్తులు సమర్పించే అవకాశం కల్పిస్తున్నామని కలెక్టర్ వెల్లడించారు.

మండల స్థాయి ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి, నిబంధనల మేరకు త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజావాణిలో వచ్చే ప్రతి దరఖాస్తును బాధ్యతగా పరిశీలించి, సమస్య పరిష్కారానికి తీసుకున్న చర్యలను నమోదు చేయాలని సూచించారు.దరఖాస్తుదారులకు పారదర్శకంగా సమాచారం అందించడంతో పాటు, పెండింగ్‌లో ఉన్న సమస్యలను నిర్దేశిత సమయంలో పరిష్కరించేలా ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత చేరువయ్యేలా మండల స్థాయిలోనే ప్రతి సోమవారం ప్రజావాణిని సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు.

మండల స్థాయి ప్రజావాణి ముఖ్యాంశాలు

ఆగస్టు 17 నుంచి మండల స్థాయి ప్రజావాణి ప్రారంభం  

ప్రతి సోమవారం మండల కేంద్రాల్లోని ఎంపీడీవో కార్యాలయంలో ప్రజావాణి నిర్వహణ  

మండల కేంద్రాల్లోనే దరఖాస్తులు సమర్పించే అవకాశం  

ప్రజల సమస్యలకు త్వరిత పరిష్కారం కోసం చర్యలు  

దరఖాస్తులపై బాధ్యతాయుతంగా పరిశీలన  

పారదర్శక సేవలు, సమయపాలనకు ప్రాధాన్యత  

పెండింగ్ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి

ప్రజలకు కలెక్టర్ విజ్ఞప్తి

ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను సంబంధిత మండల స్థాయిలో ప్రతి సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో దరఖాస్తుల రూపంలో సమర్పించి, ప్రభుత్వం అందిస్తున్న ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఎన్.వై. గిరి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

=================

ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు 

రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఆగస్టు 15, 2026న కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు.

ఆగస్టు 15న ఉదయం 9:30 గంటలకు జిల్లా కేంద్రంలోని  ఇందిరా గాంధీ స్టేడియంలో  నిర్వహించనున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో

తెలంగాణ రాష్ట్ర తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ & అభివృద్ధి సలహాదారులు వి. హనుమంతరావు గారు. గారిచే ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, గౌరవ వందనం స్వీకరించి, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారని కలెక్టర్ వెల్లడించారు.

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా, ఘనంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లను చేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా వివిధ శాఖల ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలను ప్రతిబింబించేలా ఏర్పాట్లు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.జిల్లా అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, సాధించిన పురోగతిని సమగ్రంగా తెలిపేలా ముఖ్య అతిథి ప్రసంగం నివేదిక తయారు చేస్తున్నట్టు చెప్పారు.

ఈ వేడుకల్లో ప్రజాప్రతినిధులు, స్వాతంత్ర్య సమరయోధులు, అధికారులు, విద్యార్థులు, యువత మరియు జిల్లా ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు.


Post a Comment

Previous Post Next Post