Top News

PDS Rice Seazed | అక్రమంగా తరలిస్తున్న 30 టన్నుల PDS బియ్యం లారీ పట్టివేత

అక్రమంగా తరలిస్తున్న 30 టన్నుల PDS బియ్యం లారీ పట్టివేత  

పిట్లం పోలీసుల చాకచక్యం, ఇద్దరు డ్రైవర్లపై కేసు నమోదు

కామారెడ్డి:  హైదరాబాద్ నుంచి గుజరాత్‌కు NH-161 మీదుగా అక్రమంగా PDS బియ్యం తరలిస్తున్న లారీని పిట్లం పోలీసులు పట్టుకున్నారు. ఈ దాడిలో సుమారు 30 టన్నుల PDS బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

పిట్లం పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం ఆధారంగా, పిట్లం ఎస్‌ఐ ఆంజనేయులు, సిబ్బంది వెంకటేష్, రాజేశ్వర్‌లతో కలిసి పిట్లం చౌరస్తా సమీపంలోని ఫ్లైఓవర్ వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి నాందేడ్ వైపు వెళ్తున్న GJ-25-U-7022 నంబర్ గల లారీని ఆపి తనిఖీ చేశారు.

తనిఖీలో లారీలో 632 పాలిథిన్ కవర్లలో సుమారు 30 టన్నుల PDS బియ్యం అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించి బియ్యంతో పాటు లారీని స్వాధీనం చేసుకున్నారు.

కేసు నమోదు

ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  

1. లారీ డ్రైవర్ పర్బత్ కరంటా దేవరాజ్, 52 సంవత్సరాలు, నివాసం బర్దోలి, సూరత్ జిల్లా, గుజరాత్  

2. లారీ డ్రైవర్ శరద్ ఆబా బచ్‌కర్, నివాసం ధూలే జిల్లా, మహారాష్ట్ర  

3. బియ్యం తరలిస్తున్న వ్యక్తి ఇబ్రహీం, నివాసం హైదరాబాద్

ఎస్పీ ప్రశంసలు

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ యం రాజేష్ చంద్ర, IPS, పిట్లం ఎస్‌ఐ ఆంజనేయులు, సిబ్బంది వెంకటేష్, రాజేశ్వర్‌లను అభినందించారు. అక్రమంగా తరలిస్తున్న PDS బియ్యాన్ని సమర్థవంతంగా పట్టుకుని స్వాధీనం చేసుకున్నందుకు వారి పనితీరును ప్రశంసించారు.

ప్రజలకు పంపిణీ చేయాల్సిన PDS బియ్యాన్ని అక్రమంగా తరలించడం, నిల్వ చేయడం లేదా విక్రయించడం వంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

Post a Comment

Previous Post Next Post