Top News

Police Raid Cockfighting Den | కోడిపందేల స్థావరంపై సదాశివనగర్ పోలీసుల దాడి

తిర్మన్‌పల్లి శివారులో కోడిపందేల స్థావరంపై సదాశివనగర్ పోలీసుల దాడి

12 మంది అదుపులోకి.. వాహనాలు, నగదు, కోడిపందేల కత్తులు స్వాధీనం

కామారెడ్డి: సదాశివనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిర్మాన్‌పల్లి గ్రామ శివారులో గల ఇటుక బట్టీ ప్రాంగణంలో కోడిపందేలు నిర్వహిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు CCS కామారెడ్డి వారి సహకారంతో సదాశివనగర్ పోలీసులు దాడి నిర్వహించారు.

12 మంది అదుపులోకి, వస్తువులు స్వాధీనం

ఈ దాడిలో కోడిపందేలు నిర్వహిస్తున్న 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 09 ద్విచక్ర వాహనాలు, 03 కార్లు, 11 మొబైల్ ఫోన్లు, రూ.45,050 నగదు, 65 కోడిపందేల కత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై సదాశివనగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

చట్టవిరుద్ధ కార్యకలాపాలపై కఠిన చర్యలు

చట్టవిరుద్ధంగా కోడిపందేలు, జూదం వంటి కార్యకలాపాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. ప్రజలు ఇలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, ఎక్కడైనా ఇలాంటి కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. ప్రజలు అందించే సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామని పోలీసులు తెలిపారు.

Post a Comment

Previous Post Next Post