రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా కామారెడ్డిలో ఘన నివాళులు
సద్భావన దివస్ ప్రతిజ్ఞ చేసిన డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్
జాతీయ ఐక్యత కోసం కృషి చేయాలని పిలుపు
కామారెడ్డి, ఆగస్టు 20: భారతరత్న, మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ విగ్రహానికి జిల్లా డీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఏలే మల్లికార్జున్ మాట్లాడుతూ యువతే దేశ భవిష్యత్తు అని విశ్వసించి, భారతదేశాన్ని ఆధునిక సాంకేతిక యుగం వైపు నడిపించిన దూరదృష్టి గల నాయకుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు. దేశంలో సాంకేతిక, సమాచార విప్లవానికి నాంది పలికి, దేశ ప్రగతికి బలమైన పునాదులు వేసిన ఆయన సేవలు చిరస్మరణీయమని అన్నారు.
అనంతరం రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద సద్భావన దివస్ ప్రతిజ్ఞ చేశారు. కుల, ప్రాంత, మత, భాష భేదం లేకుండా భారతదేశ ప్రజలందరి భావోద్వేగ ఐక్యత, సామరస్యం కోసం కలిసి పనిచేస్తామని, తమ మధ్య ఉన్న అన్ని విభేదాలను హింసకు పాల్పడకుండా, చర్చల ద్వారా మరియు రాజ్యాంగబద్ధమైన మార్గాల ద్వారా పరిష్కరిస్తామని ప్రతిజ్ఞ చేశారు.
జాతీయ సద్భావన, ఐక్యత, సమగ్ర అభివృద్ధి కోసం రాజీవ్ గాంధీ చూపిన మార్గం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ దేశాభివృద్ధికి కృషి చేయడమే ఆయనకు మనం అందించే నిజమైన నివాళి అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్, టీపీసీ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, టౌన్ ప్రెసిడెంట్ ఐరని సందీప్ కుమార్, డీసీసీ కార్యవర్గ సభ్యులు, కామారెడ్డి జిల్లాలోని మండల అధ్యక్షులు, టౌన్ అధ్యక్షులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.



Post a Comment