ఖయ్యూం నిశాత్ ను పరామర్శించిన ఎమ్మెల్యే పోచారం
మెరుగైన వైద్యం అందించాలని ఆస్పత్రి సీఈఓకు సూచన
బాన్సువాడ, ఆగస్టు 20: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రేషన్ డీలర్ల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఖయ్యూం నిశాత్ ను గురువారం రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పరామర్శించారు.
ఖయ్యూం నిశాత్ గత కొన్ని రోజులుగా రక్తపోటుతో బాధపడుతూ అస్వస్థతకు గురయ్యారు. ఆయనను హైదరాబాద్‌లోని మల్లారెడ్డి ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పోచారం గురువారం ఆస్పత్రికి వెళ్లి ఆయన యోగక్షేమాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా వైద్యులతో మాట్లాడి ఖయ్యూం నిశాత్ కు మెరుగైన వైద్య చికిత్స అందించాలని సూచించారు. ఖయ్యూం నిశాత్ తన 42 సంవత్సరాల మిత్రుడని, ఆయనకు మంచి వైద్యం అందించాలని ఆసుపత్రి సీఈఓ ను కోరారు. ఆయన కుమారుడు షాబాజ్ తండ్రి ఆరోగ్య పరిస్థితి గురించి ఎమ్మెల్యేకు వివరించారు.




Post a Comment