Top News

Reciption Vertical Training | కామారెడ్డి జిల్లా పోలీస్ స్టేషన్లలో పిటిషన్లకు తక్షణ రశీదు తప్పనిసరి

కామారెడ్డి జిల్లా పోలీస్ స్టేషన్లలో పిటిషన్లకు తక్షణ రశీదు తప్పనిసరి

CCTNSలో వెంటనే నమోదు చేసి పారదర్శకంగా పరిష్కరించాలని ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశం

కామారెడ్డి: ప్రజల నుంచి వచ్చే ప్రతి పిటిషన్‌ను ఆలస్యం చేయకుండా CCTNSలో నమోదు చేసి, పిటిషన్‌దారుడికి వెంటనే రశీదు ఇవ్వాలని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశించారు.

శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన రిసెప్షన్ వర్టికల్ ట్రైనింగ్ కార్యక్రమంలో ఎస్పీ పాల్గొని సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.

పిటిషన్ స్వీకరించిన వెంటనే వివరాలను సక్రమంగా నమోదు చేయాలని, ఆ తర్వాత జరిగే చర్యలన్నీ పారదర్శకంగా ఉండాలని సూచించారు. ప్రతి పోలీస్ అధికారి బాధ్యతాయుతంగా, మర్యాదపూర్వకంగా వ్యవహరించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. 

పిటిషన్లను పెండింగ్‌లో ఉంచకుండా సంబంధిత అధికారులు వెంటనే పరిశీలించి, చట్టపరమైన పరిష్కారం చూపాలని తెలిపారు.

సైబర్ నేరాల బాధితులు స్టేషన్‌కు వస్తే వారి ఫిర్యాదులను తక్షణం స్వీకరించి, సరైన మార్గదర్శకత్వం ఇవ్వాలని కూడా ఆదేశించారు. బాధితులకు సత్వర సహాయం అందించి న్యాయం జరిగేలా చూడాలని స్పష్టం చేశారు.

రిసెప్షన్ వర్టికల్ ప్రజలకు పోలీస్ శాఖతో మొదటి పరిచయం అని, అందుకే ప్రతి సిబ్బంది సానుకూల దృక్పథంతో ఉండాలని ఎస్పీ పేర్కొన్నారు. పోలీస్ సేవల్లో వేగం, పారదర్శకత, బాధ్యత ఉండాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ కె. నరసింహారెడ్డి, సదాశివనగర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సంతోష్ కుమార్ తో పాటు రిసెప్షన్ వర్టికల్ సిబ్బంది పాల్గొన్నారు.

=========================


పుల్కల్ గ్రామంలో ప్రజల సహకారంతో 28 సీసీ కెమెరాల ఏర్పాటు

గ్రామ భద్రత కోసం నిఘా వ్యవస్థ పటిష్టం - కామారెడ్డి ఎస్పీ

కామారెడ్డి: కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం పుల్కల్ గ్రామంలో ప్రజల భాగస్వామ్యంతో 28 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, ఐపీఎస్ ఆదేశాలతో ఈ నిఘా వ్యవస్థను బలోపేతం చేశారు.

డీఎస్పీ ఆధ్వర్యంలో, బిచ్కుంద సీఐ రవి కుమార్ మరియు ఎస్‌ఐ రాజు సమక్షంలో గ్రామ సర్పంచ్ సంతోష్ పటేల్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు  స్థానికుల సహకారంతో కెమెరాలను బిగించారు.

ప్రధాన కూడళ్లు, రహదారులపై ప్రత్యేక నిఘా

గ్రామంలోని ప్రధాన రహదారులు, కూడళ్లు, ప్రవేశ-నిష్క్రమణ మార్గాలు, జనం ఎక్కువగా తిరిగే ప్రాంతాలను కవర్ చేసేలా కెమెరాలను ఏర్పాటు చేశారు. దీంతో అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల కదలికలను ఎప్పటికప్పుడు గుర్తించే అవకాశం ఉంటుంది.

నేర నియంత్రణకు సీసీ కెమెరాలు కీలకం

సీసీ కెమెరాలు దొంగతనాలు, గొడవలు, రోడ్డు ప్రమాదాలు వంటి నేరాల నివారణలో కీలకంగా పనిచేస్తాయని పోలీస్ అధికారులు తెలిపారు. నేరం జరిగినప్పుడు నిందితులను త్వరగా గుర్తించి పట్టుకోవడానికి ఫుటేజ్ ఆధారంగా ఉపయోగపడుతుందని చెప్పారు. 

అలాగే ట్రాఫిక్ నియంత్రణ, మహిళలు, వృద్ధుల భద్రత, అత్యవసర సమయాల్లో పోలీసుల వేగవంతమైన స్పందనకు కూడా ఇవి సహాయపడతాయని పేర్కొన్నారు. ప్రతి గ్రామం సీసీ నిఘాలో ఉంటే నేరాల నియంత్రణ మరింత సులభమవుతుందన్నారు.

ప్రజలకు అవగాహన కార్యక్రమం

ఈ సందర్భంగా డీఎస్పీ గ్రామస్తులకు ట్రాఫిక్ నిబంధనలు, సైబర్ నేరాల నివారణ, మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు. చట్టాలను పాటిస్తూ నేర నియంత్రణలో పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు.

ప్రజల భాగస్వామ్యంతో భద్రతా వ్యవస్థను పటిష్టం చేసిన పుల్కల్ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకోవాలని, ఇతర గ్రామాలు కూడా ఇదే తరహాలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని అధికారులు సూచించారు.

ఈ కార్యక్రమంలో బిచ్కుంద సీఐ రవి కుమార్, ఎస్‌ఐ రాజు, సర్పంచ్ సంతోష్ పటేల్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రజలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.




Post a Comment

Previous Post Next Post