సిద్దిపేటలో ఆగస్టు 10 నుండి 14 వరకు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్
ప్రతి వార్డ్‌లో మొబైల్ టెస్ట్ వాహనం - మహిళలు సద్వినియోగం చేసుకోవాలని హరీష్ రావు పిలుపు
తెలంగాణ డైలీ న్యూస్ బ్యూరో,సిద్దిపేట: సిద్దిపేట పట్టణంలోని ప్రతి వార్డ్‌లో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు.
హైదరాబాద్ సింధు హాస్పిటల్ సహకారంతో ఈనెల 10వ తేదీ నుండి 14వ తేదీ వరకు మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రతి వార్డ్‌లో స్క్రీనింగ్ టెస్ట్ వాహనం ఒక సెంటర్‌లో ఉంటుంది. అక్కడే రిజిస్ట్రేషన్ చేసుకుని వెంటనే టెస్ట్ చేయించుకోవచ్చు. ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
వార్డుల వారీగా షెడ్యూల్
- 10వ తేదీ: ఉదయం 9 గంటలకు పోప భవనం, సుభాష్ నగర్
- 11వ తేదీ: ఉదయం 9 గంటలకు మహిళా భవన్, నాసార్ పుర్
- 12వ తేదీ: ఉదయం 9 గంటలకు లక్ష్మీనర్సింహ మినీ ఫంక్షన్ హాల్, లింగారెడ్డిపల్లి
- 13వ తేదీ: ఉదయం 9 గంటలకు మెదరి సంఘం, హనుమాన్ నగర్
- 14వ తేదీ: ఉదయం 9 గంటలకు పట్కర్ సంఘం, అంబేద్కర్ నగర్
మహిళల ఆరోగ్యం దృష్ట్యా ఈ శిబిరాలను ఉపయోగించుకుని క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించేందుకు ముందుకు రావాలని హరీష్ రావు విజ్ఞప్తి చేశారు.

Post a Comment