Top News

Represented to SI | మట్టి వినాయకుడే ముద్దు.. పర్యావరణ పరిరక్షణే మన బాధ్యత!

మట్టి వినాయకుడే ముద్దు.. పర్యావరణ పరిరక్షణే మన బాధ్యత!

బిచ్కుంద ఎస్ఐ జి.రాజుకు వినతిపత్రం అందజేసిన సీసీఆర్ ప్రతినిధి సుశీల్ కుమార్

బిచ్కుంద, ఆగస్టు 29:

వినాయక చవితి పండుగను పర్యావరణ హితంగా జరుపుకోవాలని కోరుతూ సీసీఆర్ కామారెడ్డి ప్రతినిధి సభ్యుడు సుశీల్ కుమార్ అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు.

బిచ్కుంద ఎస్ఐ జి.రాజుకు వినతిపత్రం అందజేసి, గ్రామాల్లో ఏర్పాటు చేసే వినాయక మండపాల నిర్వాహకులకు మట్టి విగ్రహాల వినియోగంపై అవగాహన కల్పించాలని కోరారు. ఎంఆర్ఓ, ఎంపీడీఓ తో పాటు ఇతర కార్యాలయాలకు కూడా వినతులు ఇచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ పారిస్, రసాయన రంగుల విగ్రహాల నిమజ్జనం వల్ల చెరువులు, కాలువలు కలుషితమవుతున్నాయని, మట్టి విగ్రహాలతో పర్యావరణాన్ని కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Post a Comment

Previous Post Next Post