Top News

Smart Cards Distribution | అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు - షబ్బీర్ అలీ

అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు - షబ్బీర్ అలీ

రామేశ్వరపల్లి PACS నూతన పాలకవర్గ ప్రమాణం - బిక్నూర్‌లో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా స్కూల్

దోమకొండ-బీబీపేట్ ప్రజల కోసం NH-44పై ఫ్లైఓవర్ కు గ్రీన్ సిగ్నల్

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తోంది : ఎంపీ సురేష్ శెట్కార్ 

కామారెడ్డి, ఆగస్టు 29:

బిక్నూర్ మండలం రామేశ్వరపల్లి రెడ్డి సంఘం ఫంక్షన్ హాల్ లో నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షట్కర్ ముఖ్య అతిథులుగా హాజరై లబ్ధిదారులకు కార్డులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, ఆరు గ్యారంటీలు, ఇందిరమ్మ ఇళ్లు, రైతు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు.

ఎంపీ సురేష్ షట్కర్ మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా పేదలకు మెరుగైన సేవలు అందుతాయన్నారు.

 రామేశ్వరపల్లి PACS నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం

బిక్నూర్ మండలం రామేశ్వరపల్లి PACS నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. నూతన చైర్మన్ గా బద్దం ఇంద్రకరణ్ రెడ్డి ప్రమాణం చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మాట్లాడుతూ రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, PACSలు రైతుల సమస్యలకు పరిష్కార కేంద్రాలుగా మారాలని సూచించారు. కామారెడ్డి నియోజకవర్గంలో బిక్నూర్ ప్రాంతంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి రూ.200 కోట్లు మంజూరయ్యాయని ప్రకటించారు.

ఎంపీ సురేష్ షట్కర్ మాట్లాడుతూ గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తోందన్నారు.

 NH-44 పై ఫ్లైఓవర్ కు సానుకూలత

దోమకొండ-బీబీపేట్ ప్రజల కోసం NH-44 బేసిక్ వద్ద ఫ్లైఓవర్ నిర్మించాలని స్థానికులు కోరడంతో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎంపీ సురేష్ షట్కర్ NHAI అధికారులతో కలిసి ప్రాంతాన్ని పరిశీలించారు.

ప్రజలు రహదారి దాటడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అధికారులకు వివరించారు. దీనికి NHAI అధికారులు సానుకూలంగా స్పందించి త్వరలో సర్వే చేసి నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.











Post a Comment

Previous Post Next Post