Top News

Road Accident | బాన్సువాడ సమీపంలో రోడ్డు ప్రమాదం - యువకుడు మృతి

బాన్సువాడ సమీపంలో రోడ్డు ప్రమాదం - యువకుడు మృతి

మార్చురిలో రెండు డెడ్ బాడీలు 

బంధువుల ఆర్తనాదాలు 

బాన్సువాడ, ఆగస్టు 27: బాన్సువాడ - కొత్తబాది ప్రధాన రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

ఘటన వివరాలు:

బాన్సువాడ వైపు నుండి కొత్తబాది వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనదారుడు మొగలాన్ పల్లి గ్రామ శివారులో NH-765D జాతీయ రహదారిపై ఆగి ఉన్న ట్రాక్టర్ ను వేగంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు.

మృతుడిని పాల్త్యా రాజు (28), తండ్రి  చత్రు, కొత్తబాది గిర్ని తండా వాసిగా గుర్తించారు. ఆయన ఎస్టీ లంబాడా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, వృత్తి వ్యవసాయం. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

సమాచారం అందుకున్న బాన్సువాడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. రోడ్డు పక్కన లైట్లు లేకుండా ఆగి ఉన్న ట్రాక్టర్ వల్లే ప్రమాదం జరిగిందా లేక అతివేగమే కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా, వారి రోదనలు మిన్నంటాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

> NH-765D పై రాత్రి వేళల్లో రోడ్డు పక్కన ఆగి ఉండే వాహనాలకు రిఫ్లెక్టర్లు, లైట్లు లేకపోవడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కాగా గురువారం ఉదయం బాన్సువాడ లో జరిగిన రోడ్డు ప్రమాదం లో బాలిక మృతి చెందగా, బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం లో యువకుడు మృతి చెందారు.  ఈ రెండు డెడ్ బాడీలు మార్చురి లో ఉండగా వారి బంధువులు కన్నీరు మున్నీరు అయి ఏడుస్తున్నారు.





Post a Comment

Previous Post Next Post