ప్రగాఢ సానుభూతి తెలియజేసిన రాష్ట్ర ఆగ్రో చైర్మన్
బాన్సువాడ, ఆగస్టు 24: బాన్సువాడలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందారు.
మృతుడు జల్సాని కిషోర్ (43), తండ్రి రాజయ్య, టీచర్స్ కాలనీ, బాన్సువాడ నివాసి, ప్రైవేటు ఉద్యోగి. ఆగస్టు 23 రాత్రి 11 గంటల సమయంలో తన పనులు ముగించుకుని ఎలక్ట్రిక్ స్కూటీపై ఇంటికి వెళ్తుండగా బోధన్ రోడ్డులోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపు వద్ద వర్షం కారణంగా స్కూటీ అదుపుతప్పి కిందపడటంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందినట్లు మృతుని భార్య సారిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బాన్సువాడ SHO తెలిపారు.
ప్రగాఢ సానుభూతి తెలియజేసిన రాష్ట్ర ఆగ్రో చైర్మన్
ఈరోజు బాన్సువాడ పట్టణ కేంద్రంలోని 13వ వార్డు టీచర్స్ కాలనీ జక్సని రవీందర్ సోదరుడు (తమ్ముడు) జక్సని కిషోర్ నిన్న రాత్రి ప్రమాదవశాత్తు మృతి చెందగా,తెలంగాణ రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు పరామర్శించి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి,మృతుని ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ఈ అపారమైన దుఃఖాన్ని తట్టుకునే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ అబ్దుల్ ఖాలీక్ , రిటైర్డ్ MEO రబ్బానీ, చిదుర శ్రీనివాస్, గౌస్,కాలనీ వాసులు ఉన్నారు



Post a Comment