కామారెడ్డి నియోజకవర్గంలో నలుగురు పీఏసీఎస్ ఛైర్మన్ల నియామకం
ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని కలిసి కృతజ్ఞతలు తెలిపిన నూతన ఛైర్మన్లు
కామారెడ్డి : కామారెడ్డి నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు (పీఏసీఎస్) నూతన ఛైర్మన్ల నియామకం జరిగింది.
బిక్కనూర్ మండలం రామేశ్వర్‌పల్లి పీఏసీఎస్ ఛైర్మన్‌గా బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, అంతంపల్లి పీఏసీఎస్ ఛైర్మన్‌గా చిట్టేడి సుధాకర్ రెడ్డి, దోమకొండ పీఏసీఎస్ ఛైర్మన్‌గా అనంతరెడ్డి, మాచారెడ్డి పీఏసీఎస్ ఛైర్మన్‌గా నౌసిలాల్ నాయక్ నియమితులయ్యారు.
నూతనంగా నియమితులైన ఛైర్మన్లు మంగళవారం తెలంగాణ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా షబ్బీర్ అలీ నూతన ఛైర్మన్లకు శుభాకాంక్షలు తెలుపుతూ దిశానిర్దేశం చేశారు. రైతుల సంక్షేమం, సహకార సంఘాల బలోపేతానికి కృషి చేయాలని, ప్రభుత్వ పథకాలు, రుణాలు, ఎరువులు, విత్తనాలు రైతులకు పారదర్శకంగా అందేలా చూడాలని సూచించారు. పీఏసీఎస్‌లు కేవలం రుణాలు ఇచ్చే సంస్థలుగా కాకుండా రైతుల ఆర్థికాభివృద్ధికి కేంద్రాలుగా పనిచేయాలని, ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు.
తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ రైతుల అభ్యున్నతికి కృషి చేస్తామని నూతన ఛైర్మన్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రంథాలయ ఛైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు మహమ్మద్ ఇలియాస్, మండల అధ్యక్షులు పాత రాజు, నాగన్నగారి నరేందర్ రెడ్డి, కామారెడ్డి పట్టణ అధ్యక్షుడు ఐరేని సందీప్ తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, సహకార సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.






Post a Comment