Top News

Smart Ration Cards | ఆగస్టు 15న స్మార్ట్ పీడీఎస్ రేషన్ కార్డుల పంపిణీ

ఆగస్టు 15న స్మార్ట్ పీడీఎస్ రేషన్ కార్డుల పంపిణీ 

జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి మొత్తం 2,97,438 మంది కొత్త లబ్ధిదారులకు కార్డులు

విస్తృత ఏర్పాట్లు 

కామారెడ్డి : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలంగాణ వ్యాప్తంగా 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఆగస్టు 15, 2026న 1.05 కోట్ల లామినేటెడ్ స్మార్ట్ పీడీఎస్ రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నారు. ఇందులో భాగంగా కామారెడ్డి జిల్లాలో కూడా జిల్లా స్థాయి కార్యక్రమాన్ని కళాభారతి హాల్‌లో మధ్యాహ్నం 2:00 గంటల నుంచి 4:00 గంటల వరకు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు.  

Greetings 

జిల్లాలో లక్ష్యం

జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి మొత్తం 2,97,438 మంది కొత్త లబ్ధిదారులకు కార్డులు అందజేయనున్నారు.  

- బాన్సువాడ: 35,107 కార్డులు  

- జుక్కల్: 81,910 కార్డులు  

- కామారెడ్డి: 94,632 కార్డులు  

- యెల్లారెడ్డి: 85,789 కార్డులు  

ఇందులో AFSC కార్డులు 17,798, AAP కార్డులు 823, FSC కార్డులు 2,78,817 ఉన్నాయి. జిల్లాలో మొత్తం 25 మండలాలు, 579 FPS షాపులు ఉన్నాయి.   

తహసీల్దార్లు తమ మండలాల్లో లబ్ధిదారులను సమీకరించి, FPS డీలర్లతో సమన్వయం చేసి, తహసీల్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ నిర్వహించాలని ఆదేశించారు.  

కలెక్టర్ ఆదేశాలు 

ఈ కార్యక్రమం ప్రభుత్వం పేదలకు ఆహార భద్రత కల్పించేందుకు చేపట్టిన ప్రతిష్టాత్మక పథకమని కలెక్టర్ పేర్కొన్నారు. అన్ని ఏర్పాట్లు ఆగస్టు 14, 2026 మధ్యాహ్నం 12:00 గంటలలోపు పూర్తి చేయాలని, కార్యక్రమం గౌరవప్రదంగా, క్రమశిక్షణతో జరగాలని అధికారులను ఆదేశించారు. ఏవైనా లోపాలుంటే తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించారు.  ఈ కార్యక్రమానికి MPలు, MLAలు, MLCలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని RDOలను కలెక్టర్ ఆదేశించారు.  


Post a Comment

Previous Post Next Post