ఎల్లమ్మ ఆలయంలో బంగారు ముక్కుపోగుల చోరీ కేసు ఛేదన
నిందితుల వద్ద నుంచి 36 గ్రాముల బంగారం, ద్విచక్ర వాహనం స్వాధీనం
కామారెడ్డి: సదాశివనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధర్మారావుపేట్ గ్రామంలోని ఎల్లమ్మ ఆలయంలో జరిగిన బంగారు ముక్కుపోగుల చోరీ కేసును సదాశివనగర్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి చోరీకి గురైన 36 గ్రాముల బంగారు ముక్కుపోగులను, నేరానికి ఉపయోగించిన ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధర్మారావుపేట్ గ్రామంలోని ఎల్లమ్మ ఆలయంలో బంగారు ముక్కుపోగులు చోరీకి గురైన ఘటనపై ఆలయ నిర్వాహకులు ఫిర్యాదు అందించారు. ఫిర్యాదు మేరకు పోలీసులు క్రైమ్ నం.157/2026 U/s 331(4), 305(a) BNS కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
దర్యాప్తులో భాగంగా పోలీసులు ఆధారాలు సేకరించి, నిందితుల కదలికలపై నిఘా పెట్టారు. దర్యాప్తులో తోగరి శ్రీనివాస్, వయస్సు 47 సంవత్సరాలు, సదాశివనగర్ మరియు తోగరి మల్లేశ్వరి, వయస్సు 41 సంవత్సరాలు, ధర్మారావుపేట్ నిందితులుగా గుర్తించారు.
08-08-2026న ఇద్దరూ ధర్మారావుపేట్ గ్రామంలోని ఎల్లమ్మ ఆలయానికి వెళ్లి, ఆలయానికి తాళం వేసి ఉండటాన్ని గమనించారు. ఆలయం పక్కన ఉన్న రాయితో ఇనుప గేటు తాళాన్ని పగులగొట్టి లోపలికి ప్రవేశించి, అమ్మవారి విగ్రహాలకు అలంకరించి ఉన్న బంగారు ముక్కుపోగులను చోరీ చేసినట్లు దర్యాప్తులో తేలింది.
చోరీ చేసిన బంగారు వస్తువులను వెంటనే విక్రయించకుండా ఇంట్లోని బీరువాలో దాచిపెట్టారు. 14-08-2026న ఇద్దరూ ఆ బంగారు ముక్కుపోగులను కామారెడ్డిలో విక్రయించేందుకు హీరో సీడీ డీలక్స్ మోటార్‌సైకిల్‌పై బయలుదేరారు. సుమారు 14:15 గంటలకు మర్కల్ X రోడ్డు, NH-44 వద్ద పోలీసుల వాహన తనిఖీలను గమనించిన నిందితులు భయంతో మోటార్‌సైకిల్‌ను వెనక్కి తిప్పి పారిపోయేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసులు వారిని వెంబడించి అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో నిందితులు నేరాన్ని అంగీకరించారు. వారి వద్ద నుంచి ఎల్లమ్మ ఆలయం నుంచి చోరీకి గురైన మొత్తం 36 గ్రాముల బంగారు ముక్కుపోగులు మరియు నేరానికి ఉపయోగించిన హీరో సీడీ డీలక్స్ మోటార్‌సైకిల్ను పంచుల సమక్షంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నిందితుల వివరాలు
1. తోగరి శ్రీనివాస్, వయస్సు 47 సంవత్సరాలు, సదాశివనగర్
2. తోగరి మల్లేశ్వరి, వయస్సు 41 సంవత్సరాలు, ధర్మారావుపేట్
స్వాధీనం చేసుకున్న వస్తువులు
1. ఎల్లమ్మ ఆలయం నుంచి చోరీకి గురైన 36 గ్రాముల బంగారు ముక్కుపోగులు
2. నేరానికి ఉపయోగించిన హీరో సీడీ డీలక్స్ మోటార్‌సైకిల్
ఈ కేసును ఛేదించడంలో సదాశివనగర్ ఎస్సై ఎం. పుష్పరాజ్తో పాటు క్రైమ్ పార్టీ సిబ్బంది అజర్ ఫారూక్, PC నరేష్, PC ఇసాక్ మరియు ARPC ప్రభు సమయస్ఫూర్తి, సమన్వయంతో విధులు నిర్వహించారు. నిందితులను గుర్తించి, చాకచక్యంగా వెంబడించి పట్టుకోవడంతో పాటు చోరీ సొత్తును స్వాధీనం చేయడంలో కీలకంగా వ్యవహరించారు.
కేసును సమర్థవంతంగా ఛేదించిన సదాశివనగర్ ఎస్సై, క్రైమ్ పార్టీ సిబ్బందిని జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర అభినందించారు.

Post a Comment