PRC, DA, 317, CPS రద్దు తదితర డిమాండ్లతో ఆందోళన
బోర్లం: PRC, DA, GO 317, CPS రద్దు, ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్లు, పెండింగ్ బిల్లుల సాధన కోసం ఉపాధ్యాయ సంఘాల పిలుపు మేరకు బోర్లం ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులు బ్లాక్ రిబ్బన్లతో నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా SGT యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి అయ్యాల సంతోష్ మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి PRC అమలు చేయలేదని విమర్శించారు.
ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలన్నీ ఐక్యంగా పోరాటం చేస్తేనే PRC, DA లు, ఏరియర్స్, పెండింగ్ బిల్లులు, GO 317 మరియు GO 25 రద్దు, SGT ఉపాధ్యాయులకు MLC ఓటు హక్కు వంటి డిమాండ్లను సాధించుకోవడం సాధ్యమవుతుందన్నారు.
ఉపాధ్యాయ ఉద్యోగులందరూ ఐక్యంగా ఉండాలని, రాబోయే రోజుల్లో హైదరాబాద్‌లో నిరవధిక సమ్మెకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు హెచ్‌ఎం గోపి, ఉపాధ్యాయులు చైతన్య, సత్యనారాయణ, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment