బంజారా నృత్యాలు చేసిన పోచారం
బాన్సువాడ : బాన్సువాడ గ్రామీణ మండలం పోచారం తండా, రాంపూర్ తండాలో ఘనంగా నిర్వహించిన "తీజ్" పండుగ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాస రెడ్డి గిరిజనులతో కలిసి నృత్యం చేశారు.
ఈ సందర్భంగా బంజారా సోదర సోదరీమణులందరికీ తీజ్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన పోచారం, వారి ఆనందోత్సాహాల్లో భాగస్వాములయ్యారు.
తీజ్ పండుగలో భాగంగా సంప్రదాయ పద్ధతిలో పెంచిన గోదుమ గడ్డి బుట్టలను (తీజ్) ఎత్తుకుని, బంజారా సోదరీమణులతో కలిసి ఉత్సాహంగా నృత్యం చేస్తూ పండుగను ఆనందంగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
బిజెపి ఆధ్వర్యంలో....
బాన్సువాడ గ్రామీణ మండలం పోచారం తండా, రాంపూర్ తండాలో ఘనంగా నిర్వహించిన "తీజ్" పండుగ ఉత్సవాల్లో బిజెపి నాయకులు పాల్గొని గిరిజనులతో కలిసి నృత్యం చేశారుబిజెపి రాష్ట్ర నాయకుడు పైడిమల్ లక్ష్మీనారాయణ . భక్తి శ్రద్ధ లతో ప్రత్యేక పూజలు చేశారు. గిరిజనులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.








Post a Comment