పోలీసులకు సమాచారం, కొనసాగుతున్న దర్యాప్తు
బాన్సువాడ : బాన్సువాడ పట్టణ శివారులోని కోయ్యగుట్ట సమీపంలో గల పెద్దపూలు వాగులో ఇస్లాం పూరాకు చెందిన లక్ష్మవ్వ (55) ఆత్మ హత్య చేసుకున్న సంఘటన జరిగింది.
పశువుల కాపరుల దృష్టికి వచ్చిన ఘటన
ఆదివారం ఉదయం పశువుల కాపరులు వాగు వద్దకు వెళ్లగా, నీటిపై ఒక మహిళా మృతదేహం తేలియాడుతుండటాన్ని గమనించారు. వెంటనే వారు బాన్సువాడ పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసుల విచారణ
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని వాగు నుండి వెలికి తీసి పంచనామా నిర్వహించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మృతురాలిని లక్ష్మవ్వ గా పోలీసులు గుర్తించారు. ఆమె గత కొంత కాలంగా పక్షవాతంతో బాధ పడుతున్నారు. ఈ నేపథ్యంలో జీవితం పై విరక్తి చెంది ఆత్మహత్య కు పాల్పడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.




Post a Comment