Top News

Vasavi Service Award | వాసవి సేవా వైభవ జ్ఞాన సింధు అవార్డుతో డా. మాంకాల నవీన్ కుమార్‌కు ఘన సత్కారం

వాసవి సేవా వైభవ జ్ఞాన సింధు అవార్డుతో డా. మాంకాల నవీన్ కుమార్‌కు ఘన సత్కారం  

సేవా కార్యక్రమాలను కొనియాడిన ప్రముఖులు

 తెలంగాణ డైలీ న్యూస్,  సిద్ధిపేట: సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక చింతన, సామాజిక సేవా రంగాలలో విశిష్ట సేవలు అందిస్తున్న ప్రముఖ నంది అవార్డు గ్రహీత, ఆర్యవైశ్య మహాసభ నాయకులు డా. మాంకాల నవీన్ కుమార్‌కు "వాసవి సేవా వైభవ జ్ఞాన సింధు" అవార్డు ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు.

సికింద్రాబాద్‌లో ఘనంగా అవార్డు ప్రదానోత్సవం  

ఈ అవార్డు కార్యక్రమాన్ని మహేంద్రుల వెంకటేశ్వర్లు గారి అధ్యక్షతన లలితకళా సమాఖ్య - సేవా సామాజిక సాంస్కృతిక సంస్థ మరియు రుద్రాక్ష వైభవం ఆధ్యాత్మిక పీఠం సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం సికింద్రాబాద్ హరిహర కళా భవన్‌లో అత్యంత వైభవంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి పండితులు, ప్రముఖ వైద్యులు, జ్యోతిష్య పండితులు, ఆర్యవైశ్య ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు, సినీ నటులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు తదితరులు హాజరై డా. మాంకాల నవీన్ కుమార్ సేవలను కొనియాడారు.

వివిధ సేవలకు గుర్తింపు  

సమాజ సేవ, ఆధ్యాత్మిక సేవ, విద్యా సేవ, వైద్య సహాయం, అన్నదాన కార్యక్రమాలు, వాసవి క్లబ్ ద్వారా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు, ఆర్యవైశ్య సమాజ అభివృద్ధికి అందిస్తున్న విశేష కృషిని గుర్తించి ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును అందజేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడుతూ, డా. మాంకాల నవీన్ కుమార్ సమాజానికి స్ఫూర్తిదాయకంగా సేవలందిస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి సమాజానికి మరింత సేవ చేయాలని ఆకాంక్షిస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.

మరింత బాధ్యతతో సేవ చేస్తాను: డా. మాంకాల నవీన్  

ఈ అవార్డు లభించడం పట్ల డా. మాంకాల నవీన్ కుమార్ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ గౌరవాన్ని మరింత బాధ్యతగా భావించి సమాజ సేవను మరింత విస్తృతంగా కొనసాగిస్తానని పేర్కొన్నారు.

-----------------------------------------------


సంతోష్ కు ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర పదవి 

కార్యవర్గ సభ్యునిగా ప్రమాణ స్వీకారం

సిద్ధిపేట: తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ కార్యవర్గ సభ్యునిగా నియమితులైన మురంశెట్టి సంతోష్ కుమార్ ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు.

హైదరాబాద్‌లో ప్రమాణ స్వీకార కార్యక్రమం

హైదరాబాద్‌లోని వాసవి కల్యాణ మండపంలో నిర్వహించిన కార్యక్రమంలో సంతోష్ కుమార్ పదవీ ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి టీజీ. వెంకటేష్ హాజరయ్యారు. మహాసభ రాష్ట్ర అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ, కొల్లేటి దామోదర్, ముక్త శ్రీనివాస్, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

పేద వైశ్యుల సంక్షేమానికి కృషి: సంతోష్ కుమార్ 

ఈ సందర్భంగా సంతోష్ కుమార్ మాట్లాడుతూ, తన సేవలను గుర్తించి రాష్ట్ర స్థాయిలో పదవి కల్పించినందుకు మహాసభ ఉపాధ్యక్షులు గంప శ్రీనివాస్‌కు కృతజ్ఞతలు తెలిపారు. పేద వైశ్యుల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.



Post a Comment

Previous Post Next Post