SIR ప్రక్రియలో అన్‌కలెక్టబుల్ జాబితాలో 84,268 మంది
నియోజకవర్గాల వారీగా గణాంకాలు
కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలోని మూడు శాసనసభ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 1,84,784 మంది ఓటర్లకు నోటీసులు అందనున్నాయి. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR ప్రక్రియలో భాగంగా మ్యాపింగ్ కాని, వివరాల్లో తప్పులు ఉన్న, అనుమానాస్పదంగా ఉన్న ఓటర్లకు బూత్ స్థాయి అధికారుల ద్వారా నోటీసులు జారీ చేయనున్నారు. బాన్సువాడ నియోజకవర్గం నిజామాబాద్ జిల్లా పరిధిలోకి వస్తుంది.
ఎన్నికల సంఘం సోమవారం ముసాయిదా ఓటరు జాబితాను ప్రకటించింది. SIR ప్రారంభానికి ముందు జిల్లాలో 6,96,006 మంది ఓటర్లు ఉండగా, ఇంటింటి ఎన్నుమరేషన్ దశ ముగిసే సరికి 6,11,738 మంది మాత్రమే ఉన్నారు. ఈ క్రమంలో జిల్లాలో సుమారు 84 వేలకు పైగా ఓట్లు తగ్గాయి.
ఎన్నుమరేషన్ ఫారాలు సమర్పించిన వారిలో 84,268 మంది అన్‌కలెక్టబుల్ జాబితాలో ఉన్నారు. వీరిలో 36,440 మంది ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా వెళ్లిపోయారు. 21,346 మంది మరణించారు. 18,584 మంది రెండు చోట్ల ఓటుహక్కు కలిగి ఉన్నారు. 7,728 మంది గైర్హాజరయ్యారు. మిగిలిన 170 మంది ఇతర కారణాల వల్ల జాబితా నుంచి తొలగింపునకు గురయ్యారు.
నియోజకవర్గాల వారీగా గణాంకాలు - సెప్టెంబర్ 17 వరకు అభ్యంతరాలకు అవకాశం
నియోజకవర్గాల వారీగా వివరాలు చూస్తే జుక్కల్ లో 2,06,343, ఎల్లారెడ్డిలో 2,28,503, కామారెడ్డిలో 2,61,160 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో అన్‌కలెక్టెడ్ ఓట్లు జుక్కల్ లో 20,032, ఎల్లారెడ్డిలో 22,469, కామారెడ్డిలో 41,767 ఉన్నాయి.
అనామలీన్ ఓట్లు జుక్కల్ లో 51,498, ఎల్లారెడ్డిలో 52,716, కామారెడ్డిలో 61,394 ఉన్నాయి. అన్ మ్యాప్డ్ ఓట్లు కూడా మూడు నియోజకవర్గాల్లో గణనీయంగా ఉన్నాయి.
2002 ఓటరు జాబితా వివరాలు ఇవ్వని 19,176 మందిని అన్ మ్యాపింగ్ ఓటర్లుగా, అసంబద్ధ సమాచారం ఇచ్చిన 1,52,286 మందిని అనామలీన్ ఓటర్లుగా గుర్తించి వారికి కూడా నోటీసులు ఇవ్వనున్నారు.
నోటీసులు అందిన ఓటర్లు తమ అర్హతను నిరూపించుకునేందుకు ఎన్నికల సంఘం సూచించిన 12 ధృవీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 17 వరకు అభ్యంతరాలు, క్లెయిములు స్వీకరిస్తారు. అక్టోబర్ 19న తుది ఓటరు జాబితాను ప్రకటించనున్నారు.

Post a Comment