Top News

Ward Sabha | 13వ వార్డులో ఓటర్ల ముసాయిదా జాబితాపై గ్రామసభ

బాన్సువాడ 13వ వార్డులో ఓటర్ల ముసాయిదా జాబితాపై గ్రామసభ

ఓటు విలువైనది - ప్రతి ఒక్కరూ సరి చూసుకోవాలి: ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు

 13వ వార్డు గ్రామసభకు హాజరైన ఆర్డీఓ రవీందర్ రెడ్డి, జాబితాపై వివరణ

బాన్సువాడ, ఆగస్టు 27: బాన్సువాడ మున్సిపాలిటీలోని 13వ వార్డు కార్యాలయంలో బుధవారం ఓటర్ల ముసాయిదా జాబితాపై గ్రామసభ నిర్వహించారు. ఈ సభకు బాన్సువాడ నియోజకవర్గ ఎన్నికల అధికారి, ఆర్డీఓ రవీందర్ రెడ్డి, టీజీ ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు హాజరయ్యారు.

చైర్మన్ కాసుల బాలరాజు స్పీచ్: 

ఈ సందర్భంగా ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు మాట్లాడుతూ.. "ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైన ఆయుధం. ప్రతి అర్హుడి ఓటు నమోదు కావాలి. 13వ వార్డు ప్రజలందరూ తమ పేర్లు, తమ కుటుంబ సభ్యుల పేర్లు ముసాయిదా జాబితాలో ఉన్నాయో లేదో క్షుణ్ణంగా సరి చూసుకోవాలి. ఎక్కడైనా తప్పులు ఉంటే, పేరు మిస్ అయితే వెంటనే బీఎల్ఓ ను సంప్రదించి సరి చేసుకోవాలి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ SIR ప్రక్రియను విజయవంతం చేయాలి" అని పిలుపునిచ్చారు.

ఆర్డీఓ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) తర్వాత తయారైన జాబితాను అన్ని చోట్ల ప్రదర్శించామని, చనిపోయిన వారు, వలస వెళ్లిన వారి పేర్లు తొలగించేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. అనంతరం బీఎల్ఓ వార్డు ఓటర్ల జాబితాను చదివి వినిపించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్, కౌన్సిలర్ అబ్దుల్ ఖాలీక్, కో-ఆప్షన్ సభ్యులు మహ్మద్ గౌస్, బీఎల్ఓలు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.





Post a Comment

Previous Post Next Post