12న చందూర్ లో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ సురేష్ షెట్కర్ పర్యటన - ఆయకట్టుకు సాగునీరు విడుదల
సభా స్థలం, మోటార్ల ఏర్పాట్లను పరిశీలించిన మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి
చందూర్, సెప్టెంబర్ 10: చందూర్ మండల కేంద్రంలో ఈ నెల 12వ తేదీ శనివారం ఉదయం 10 గంటలకు చందూర్ లిఫ్ట్ ఇరిగేషన్ మోటార్లను ప్రారంభించి ఆయకట్టు పొలాలకు సాగునీటిని విడుదల చేయనున్నారు. అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శంకుస్థాపనలు చేయనున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్ హాజరుకానున్నారు.
ఈ నేపథ్యంలో గురువారం మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి చందూర్, ఉమ్మడి వర్ని మండల నాయకులతో కలిసి చందూర్ లిఫ్ట్ ఇరిగేషన్ మోటార్ పంపులను, సాగునీటి విడుదలకు సంబంధించిన ఏర్పాట్లను, సభా స్థలాన్ని పరిశీలించారు.
కార్యక్రమానికి వచ్చే రైతులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని స్థానిక నాయకులకు సూచించారు.
చందూర్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఆయకట్టు రైతులకు సాగునీరు అందడంతో రైతుల పొలాలకు నీరు చేరి వ్యవసాయానికి మరింత బలం చేకూరుతుందని, పంటల సాగు విస్తీర్ణం పెరగడంతో పాటు దిగుబడులు, ఆదాయం పెరిగేందుకు ఈ లిఫ్ట్ ఎంతో దోహదపడుతుందని భాస్కర్ రెడ్డి తెలిపారు. ఈ పరిశీలన కార్యక్రమంలో చందూర్, ఉమ్మడి వర్ని మండలాల ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Post a Comment