రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్న కామారెడ్డి టీచర్
తెలంగాణ నుంచి ఏకైక మహిళగా భవాని రికార్డు
యూట్యూబ్ పంతులమ్మగా ఫేమస్
కామారెడ్డి, సెప్టెంబర్ 05: కామారెడ్డి జిల్లాకు జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. గాంధారి మండల కేంద్రంలోని MPPS బాలికల ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బొంపెల్లి భవాని జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలి అవార్డును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు.
ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో 48 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం చేశారు. ఈ 48 మందిలో తెలంగాణ నుంచి ఎంపికైన ఏకైక ఉపాధ్యాయురాలు భవాని కావడం విశేషం.
ఫిన్లాండ్ వరకు ప్రతిభకు గుర్తింపు.. భవానికి మరో అరుదైన గౌరవం!
గాంధారి బాలికల ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బొంపెల్లి భవాని ప్రతిభకు కేవలం జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలోనూ గుర్తింపు దక్కింది.
విద్యా రంగంలో వినూత్న ఆలోచనలు, కొత్త బోధనా పద్ధతులను అమలు చేస్తున్నందుకు గాను ఆమె ఫిన్లాండ్ విద్యా అధ్యయన పర్యటనకు ఎంపికయ్యారు. ఫిన్లాండ్ విద్యా విధానం ప్రపంచంలోనే అత్యుత్తమమైనదిగా పరిగణిస్తారు. అలాంటి దేశంలో పర్యటించి అక్కడి బోధనా పద్ధతులను అధ్యయనం చేసేందుకు తెలంగాణ నుండి భవాని ఎంపిక కావడం గొప్ప విషయం.
అదేవిధంగా DCPP స్థాయిలో గుర్తింపుతో పాటు జిల్లా ఉత్తమ ప్రధానోపాధ్యాయురాలిగా కూడా పురస్కారం అందుకున్నారు.
భవాని అవలంబిస్తున్న వినూత్న బోధనా విధానాలు, పాఠశాల అభివృద్ధి కోసం చేస్తున్న కృషిని SCERT సైతం గుర్తించింది. ఆమె సేవలు, అనుభవాలను 'ట్రయల్ బ్లేజర్స్' పుస్తకంలో ప్రచురించడం విశేషం.
యూట్యూబ్ ద్వారా పాఠాలను పాటలు, ఆటల రూపంలో చెప్పడం, పిల్లల్లో గణితంపై భయాన్ని పోగొట్టడం వంటి వినూత్న ప్రయోగాలే ఆమెను ఈ స్థాయికి తీసుకెళ్లాయి. తాజాగా రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ అవార్డు అందుకోవడం, ఇప్పుడు ఫిన్లాండ్ పర్యటనకు ఎంపిక కావడంతో కామారెడ్డి జిల్లా విద్యాశాఖలో ఆనందం వ్యక్తమవుతోంది.
ఎవరీ భవాని?
భవాని 2018 నుంచి గాంధారి బాలికల పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ఆమె బోధనా పద్ధతి చాలా వినూత్నం.
- యూట్యూబ్ పంతులమ్మగా ఫేమస్: పాఠాలను యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పాటలు, నృత్య రూపకాలు, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ద్వారా పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా బోధిస్తారు.
- గణితం వంటి కఠినమైన సబ్జెక్టులను కూడా ఆటలతో నేర్పిస్తారు.
- పాఠశాలలో విద్యార్థుల నమోదు (ఎన్‌రోల్‌మెంట్) పెంచడంలో ఆమె కృషిని గుర్తించి తెలంగాణ SCERT ప్రచురించిన 'ట్రైల్ బ్లేజర్స్' పుస్తకంలో ఆమె పాఠాన్ని చేర్చారు.
- గత ఏడాది 2025లో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు. ఈ ఏడాది నేరుగా జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు.
కేంద్ర విద్యాశాఖ జూన్ 15 నుండి జూలై 20 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరించి, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో మూడు దశల్లో పరిశీలించి 27 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాల నుండి 48 మందిని ఎంపిక చేసింది.
వినూత్న పద్ధతుల్లో విద్యాబోధన చేస్తున్న భవానికి జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కడం జిల్లాకు గర్వకారణమని పలువురు అభినందిస్తున్నారు.
ఈ ఫోటోల్లో కనిపిస్తున్న ఉపాధ్యాయురాలే బొంపెల్లి భవాని. నిన్నటి వరకు గాంధారిలోని ఒక చిన్న ప్రభుత్వ బాలికల పాఠశాలలో పిల్లలకు ఆటపాటలతో పాఠాలు చెప్పిన టీచర్, నేడు దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు.
ఫోటోల్లో కనిపిస్తున్నదే ఆమె ప్రత్యేకత:
1. Fun with Maths: బ్లాక్ బోర్డుపై 63 x 11 = 693 అంటూ ట్రిక్స్ తో గణితాన్ని సులభం చేస్తారు. పిల్లలు లెక్కలంటే భయపడకుండా ఇష్టపడేలా చేస్తారు.
2. No. of Squares:చతురస్రాలను లెక్కించడం ద్వారా లాజిక్ పెంచుతారు.
3. యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్: తరగతి గది బయట పిల్లలతో కలిసి డ్యాన్స్ చేస్తూ, భోజనం చేస్తూ, ప్రకృతిలో పాఠాలు చెబుతారు. అందుకే ఆమెను 'యూట్యూబ్ పంతులమ్మ' అని పిలుస్తారు. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ లో ఆమె వీడియోలకు లక్షల వ్యూస్ ఉన్నాయి.
అవార్డు ప్రయాణం:
- 2018 నుండి గాంధారి MPPS గర్ల్స్ స్కూల్ లో హెడ్మిస్ట్రెస్ గా పని.
- పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను 20 నుండి 150కి పెంచారు.
- ఆమె కృషిని గుర్తించి తెలంగాణ ప్రభుత్వం SCERT 'Trailblazers' పుస్తకంలో ఆమె పాఠాన్ని చేర్చింది.
- 2025లో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు.
- 2026లో దేశవ్యాప్తంగా ఎంపికైన 48 మందిలో తెలంగాణ నుండి ఎంపికైన ఏకైక మహిళా టీచర్ గా నేషనల్ అవార్డు.
ఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్న తర్వాత ఆమె ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది. ప్రభుత్వ టీచర్ అంటేనే చులకనగా చూసే రోజుల్లో, ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ బడిని తీర్చిదిద్దిన భవానికి అందరూ అభినందనలు తెలుపుతున్నారు.



Post a Comment