బాన్సువాడలో సంక్షేమ పథకాల పంపిణీలో జోరు - 121 ఇందిరమ్మ ఇళ్లు, రూ.30 లక్షలకు పైగా CMRF చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే పోచారం
బాన్సువాడ :బాన్సువాడ నియోజకవర్గంలో సంక్షేమ పథకాల పంపిణీ కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి శనివారం తన స్వగృహంలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు, CMRF చెక్కులను పంపిణీ చేశారు.
వర్ని, చందూర్, మోస్రా మండలాలకు చెందిన 121 మంది పేదలకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు. సొంత ఇంటి కలను నెరవేర్చుకోనున్న లబ్ధిదారుల్లో ఆనందం వ్యక్తమైంది.
అదేవిధంగా నియోజకవర్గంలోని 9 మండలాలకు చెందిన 98 మంది బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) కింద రూ. 30,86,750 విలువైన చెక్కులను అందజేశారు. అనారోగ్యంతో ఆస్పత్రుల్లో చికిత్స పొంది ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నిరుపేదలకు ఈ చెక్కులు అండగా నిలుస్తాయని ఎమ్మెల్యే తెలిపారు.
అత్యధికంగా వర్ని మండలంలో 21 మందికి రూ.7.24 లక్షలు, నసురుల్లాబాద్ మండలంలో 15 మందికి రూ.5.32 లక్షలు పంపిణీ చేశారు.
వర్ని, చందూర్, మోస్రా మండలాలకు సంబంధించి 121 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. అలాగే నియోజకవర్గంలోని *98 మంది ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) లబ్ధిదారులకు రూ. 30,86,750/- ల చెక్కులను పంపిణీ చేశారు.
మండలాల వారీగా CMRF లబ్ధిదారుల వివరాలు:
మండలం లబ్ధిదారుల సంఖ్య మొత్తం
బాన్సువాడ పట్టణం 11 మంది రూ. 3,40,000/-
బాన్సువాడ గ్రామీణం 13 మంది రూ. 3,61,500/-
బీర్కూర్ 8 మంది రూ. 2,54,000/-
నసురుల్లాబాద్ 15 మంది రూ. 5,32,500/-
మోస్రా 5 గురు రూ. 90,500/-
చందూర్ 3 గురు రూ. 70,000/-
వర్ని 21 మంది రూ. 7,24,750/-
రుద్రూర్ 5 గురు రూ. 1,84,000/-
కోటగిరి 4 గురు రూ. 1,30,000/-
పోతంగల్ 11 మంది రూ. 3,39,000/-
ఇతరులు 2 గురు రూ. 60,500/-
మొత్తం 98 మంది రూ. 30,86,750/-
ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేస్తామని పోచారం శ్రీనివాస్ రెడ్డి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ ఎజాజ్, హకీమ్, గౌస్, అబ్దుల్ వహాబ్, చంద్రశేఖర్, బాబా తదితరులు పాల్గొన్నారు.




Post a Comment