Bapuji Jayanthi | జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి

కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి

కామారెడ్డి, సెప్టెంబర్ 27: జిల్లా పోలీస్ కార్యాలయంలో స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ సాధన ఉద్యమ నేత కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.

అనంతరం ఎస్పీ మాట్లాడుతూ... కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితాన్ని దేశసేవకు, ప్రజాసేవకు అంకితం చేసిన మహనీయుడని కొనియాడారు. స్వాతంత్ర్య పోరాటంలో, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేక ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం దశాబ్దాలపాటు అలుపెరగని పోరాటం చేశారని తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తన ఇల్లు, ఆస్తులను సైతం ఉద్యమ కార్యకలాపాలకు వినియోగిస్తూ స్వరాష్ట్ర సాధన కోసం కృషి చేశారని, ఆయన త్యాగం చిరస్మరణీయమని అన్నారు.

బాపూజీ నిబద్ధత, త్యాగం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని, ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో డీపీఓ సిబ్బంది, వివిధ పోలీస్ విభాగాల సిబ్బంది, ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post