Minister Vivek | మాలలకు న్యాయం చేయాలని మంత్రి వివేక్ వెంకటస్వామికి వినతి

మాలలకు న్యాయం చేయాలని మంత్రి వివేక్ వెంకటస్వామికి వినతి

హైదరాబాద్, సెప్టెంబర్ 27: తెలంగాణ రాష్ట్ర బొగ్గు, కార్మిక, ఉపాధి, మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి కు మాల సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా మాల సంఘం నాయకులు అయ్యాల సంతోష్ మాట్లాడుతూ... SC వర్గీకరణలో మాలలకు కేటాయించిన రోస్టర్ పాయింట్ 22 వల్ల విద్య, ఉద్యోగాలలో మాలలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రోస్టర్ పాయింట్ ను 12 లోపు ఉండే విధంగా సీఎంతో చర్చించి మాలలకు న్యాయం చేయాలని కోరారు.

అలాగే మాలలకు ప్రస్తుతం ఉన్న 5 శాతం రిజర్వేషన్ ను 8 శాతానికి పెంచాలని, మాలలకు ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

దీనిపై మంత్రి వివేక్ వెంకటస్వామి స్పందిస్తూ... ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకునేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో దవులయ్య, సంజీవ్, బాలరాజ్, రవి తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post