ప్రవక్త జన్మదిన మాసం సందర్భంగా రక్తదాన శిబిరం
రక్తదానం అన్ని దానాల కన్నా గొప్పది - మౌలానా రిజ్వాన్
బాన్సువాడ : బాన్సువాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఆవరణలో మహమ్మద్ ప్రవక్త జన్మించిన నెల సందర్భంగా హ్యుమానిటీ వెల్ఫేర్ సొసైటీ, బాన్సువాడ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. శ్రీనివాస్ ఈ శిబిరాన్ని ప్రారంభించారు.
సొసైటీ గౌరవ అధ్యక్షులు మౌలానా రిజ్వాన్ మాట్లాడుతూ, ప్రవక్త జన్మదిన మాసాన్ని పురస్కరించుకుని ఈ సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పదని, ఆపదలో ఉన్నవారికి, ప్రమాదాల్లో గాయపడిన వారికి, ఆపరేషన్ సమయంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి రక్తం ఇచ్చి ప్రాణాలు కాపాడటమే తమ ముఖ్య ఉద్దేశమని అన్నారు. రక్తం అవసరమైనప్పుడు డబ్బులు కూడా పనిచేయవని, రక్తదానం వల్ల ఒకరి ప్రాణాన్ని కాపాడవచ్చని పేర్కొన్నారు.
ఈ రక్తదాన శిబిరంలో హిందూ-ముస్లిం అనే భేదం లేకుండా యువకులు భారీ సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో హాఫిజ్ షకీల్, కౌన్సిలర్ అబ్దుల్ ఖలేక్, లాయక్, హాఫిజ్ ఉస్మాన్, హాఫిజ్ ఇంతేజార్ తదితరులు పాల్గొన్నారు.




Post a Comment