కాంగ్రెస్ ను గద్దె దించాలి - మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్
అసెంబ్లీ ఘటనకు నిరసనగా బాన్సువాడలో బీఆర్ఎస్ ధర్నా
సీఎం ఫ్లెక్సీ దహనం యత్నం - అడ్డుకున్న పోలీసులు
బాన్సువాడ :బాన్సువాడలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. నిన్న అసెంబ్లీ వద్ద తమ నాయకులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించిన తీరుకు నిరసనగా ఈ ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ, తమ నాయకులు కేటీఆర్, హరీష్ రావులపై పోలీసులు వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండించారు. మహిళా శాసనసభ్యులని కూడా చూడకుండా ఈడ్చివేయడం అమానవీయ చర్య అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా గుండాయిజం చేస్తోందని, బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేస్తోందని మండిపడ్డారు. త్వరలో ప్రజలే కాంగ్రెస్ కు బుద్ధి చెప్పి గద్దె దించే రోజులు వస్తాయన్నారు.
అనంతరం ఆగ్రహించిన కార్యకర్తలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో ఫ్లెక్సీకి నిప్పు పెట్టే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ జుబేర్, మోరల్ శ్రీనివాస్, మాజీ రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు అంజిరెడ్డి, ఎర్రవట్టి సాయిబాబా,బాడీ శ్రీనివాస్, షేక్ అక్బర్,మోచి గణేష్, ఖలీల్, బోడా చందర్, ప్రసాద్, రమేష్ యాదవ్, రాము, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.




Post a Comment