ప్రజా పాలనలో పారదర్శకత, అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం - మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద
నిజాం పాలన నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థకు పరివర్తన చెందిన చారిత్రక రోజు
కలెక్టరేట్ లో ఘనంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం
కామారెడ్డి, తెలంగాణ డైలీ న్యూస్ బ్యూరో : తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం కామారెడ్డి కలెక్టరేట్ లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
కలెక్టరేట్ కు చేరుకున్న ముఖ్య అతిథి నేరెళ్ల శారదకు జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, అదనపు కలెక్టర్ రెవెన్యూ విక్టర్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర పుష్పగుచ్ఛాలు అందించి ఘన స్వాగతం పలికారు. అనంతరం పోలీసు సిబ్బంది నుంచి ఆమె గౌరవ వందనం స్వీకరించారు.
ముఖ్య అతిథి నేరెళ్ల శారద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆమెతో పాటు జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, అదనపు కలెక్టర్ రెవెన్యూ విక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్ వై గిరి, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, జిల్లా అధికారులు అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కళాకారులు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, చారిత్రక నేపథ్యాన్ని ప్రతిబింబించేలా వివిధ కళారూపాలను ప్రదర్శించారు. దేశభక్తి గీతాలు, తెలంగాణ జానపద నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలతో కార్యక్రమ ప్రాంగణం సందడిగా మారింది.
ఈ సందర్భంగా ముఖ్య అతిథి నేరెళ్ల శారద మాట్లాడుతూ, తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం రాష్ట్ర చరిత్రలో ఎంతో ప్రాధాన్యత కలిగిన రోజని పేర్కొన్నారు. నిజాం పాలన నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థకు పరివర్తన చెందిన చారిత్రక ఘట్టాన్ని స్మరించుకోవడంతో పాటు, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
ప్రజా పాలనలో పారదర్శక పాలన, అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి, సామాజిక సమానత్వం కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు.
తెలంగాణ సాయుధ పోరాట ఫలితంగా అప్పటి వరకు పల్లెల్లో నెలకొన్న వెట్టి చాకిరీ, భూస్వామ్య వ్యవస్థ, మాతృభాష అణచివేత, నిరంకుశ దోపిడీలు తొలగి 17 సెప్టెంబర్ 1948 న హైదరాబాద్ సంస్థానం రాచరిక వ్యవస్థ నుండి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి మారిందని గుర్తుచేశారు. ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఒకొక్కటిగా అధికారంలోకి వచ్చిన 48 గంటల నుండే అమలు చేయడం ప్రారంభించిందని తెలిపారు.
కామారెడ్డి జిల్లాలో వివిధ రంగాల్లో సాధించిన ప్రగతిని ఈ సందర్భంగా వివరించారు:
1. ప్రస్తుత వానా కాలం సీజన్ లో 5 లక్షల 53 వేల 437 ఎకరాలలో వివిధ రకముల పంటలు సాగు చేయడం జరిగింది.
2. ఇందిరమ్మ రైతు భరోసా సహాయం కింద 3 లక్షల 6 వేల 890 మంది రైతుల బ్యాంకు ఖాతాలో 305 కోట్ల 72 లక్షల రూపాయలు జమ చేయడం జరిగింది.
3. 4 వేల 244 క్వింటాళ్ల వరి నూకల విత్తనాలను 3 కోట్ల 42 లక్షల వ్యయంతో 50% సబ్సిడీ పై రైతులకు అందించడం జరిగింది.
4. ప్రస్తుత వానాకాలంలో 2500 ఎకరాలలో 82 లక్షల 50 వేల రూపాయల విలువ గల 750 క్వింటాళ్ల సోయాబీన్ విత్తనాలను 100% సబ్సిడీపై రైతులకు పంపిణీ చేసి వారికి శిక్షణ తరగతులు ఇప్పించడం జరిగింది.
5. జిల్లాలో ప్రస్తుతం ఆయిల్ పామ్ లో ఇప్పటి వరకు 1 వేయి 42 మంది రైతులు 2 వేల 882 ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు చేయడం జరిగింది. ప్రస్తుత సంవత్సరం 1300 ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు చేయుట లక్ష్యం కాగా ఇప్పటి వరకు 1 వేయి 233 ఎకరాలకు గాను పరిపాలన మంజూరు చేయడం జరిగింది. 433 ఎకరాలలో ప్లాంటేషన్ చేయడం జరిగినది. మిగతా స్విస్టర్న్ గురించి రైతులకు ఎంపిక జరుగుచున్నది.
6. జిల్లాలో కొత్తగా 43 వేల 591 కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయడం జరిగింది. దీని ద్వారా 1 లక్ష 30 వేల 733 మంది లబ్ధిదారులకు లబ్ధి చేకూరడం జరిగింది.
7. ఆధునిక పారదర్శక మరియు సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ప్రజా పంపిణీ వ్యవస్థ దిశగా తెలంగాణ ప్రభుత్వం టీ-రేషన్ మొబైల్ అప్లికేషన్ తో అనుసంధానించబడిన స్మార్ట్ రేషన్ కార్డులను ప్రారంభించింది. కామారెడ్డి జిల్లాలో సకలింగ్, ఫోర్తల్ మరియు దుర్బినియోగాన్ని అరికట్టడానికి అనునాతన ఫీచర్లతో కూడిన సుమారు 2 లక్షల 96 వేల 377 స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయడం జరుగునున్నది.
8. 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ సరఫరా పథకం కింద కామారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు 1 లక్ష 51 వేల 520 మంది వినియోగదారులకు 10 లక్షల 76 వేల 844 గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయడం జరిగింది. దీనికి గాను ప్రభుత్వం 33 కోట్ల 28 లక్షల రూపాయల సబ్సిడీ అందించింది.
9. జిల్లాలో చేయూత పథకము క్రింద అన్ని రకాల పింఛనుల కలిపి 1 లక్ష 55 వేల మంది పింఛను లబ్ధిదారులకు ప్రతి నెల 37 కోట్ల 61 లక్షల రూపాయలు పంపిణీ చేయడము జరుగుచున్నది.
10. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిరుపేదలకు చేయూతను అందించాలని ఒక మంచి ఆలోచనతో నూతన పెన్షన్ల మంజూరు చేయాలని నిర్ణయించి ఈ నెల 7వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తులను స్వీకరించడం ప్రారంభించడం జరిగింది. ఇట్టి నూతన పెన్షన్లలో వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, వైదొలగిన దాయాదులు, దయార్థులు, రక్త సంబంధ వ్యాధులతో బాధపడుతున్న వారు, హెచ్ఐవి, సికిల్ సెల్, కుష్టు, చేనేత మరియు గీత కార్మికులకు పెన్షన్లను మంజూరు చేయడం జరుగుతుంది. జిల్లాలో ఇప్పటి వరకు 14 వేల 570 మంది నూతన పెన్షన్ల గురించి దరఖాస్తు చేసుకున్నారు.
11. బ్యాంకు లింకేజీ మరియు స్త్రీ నిధి ద్వారా గ్రామీణ మహిళా సంఘాలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 328 కోట్ల 70 లక్షల రూపాయలు మరియు పట్టణ మహిళా సంఘాలకు 42 కోట్ల రూపాయలను బ్యాంకు సహాయంగా అందించడం జరిగింది
12. జిల్లాలో ఇప్పటి వరకు 7 కోట్ల 87 లక్షల 0 వడ్డీ రుణాల ద్వారా మహిళలు ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. దీని ద్వారా జిల్లాలోని మహిళలకు 273 కోట్ల 22 లక్షల రూపాయల లబ్ధి చేకూరింది.
13. 2026-27 సంవత్సరంలో వన మహోత్సవం క్రింద 22 లక్షల 39 వేల మొక్కలు నాటడం జరిగింది.
14. గృహ జ్యోతి పథకం క్రింద జిల్లాలో 1 లక్ష 75 వేల 306 మంది వినియోగదారులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ని అందించడం జరుగుతుంది. ఇందు కోసం ప్రభుత్వం ఇప్పటి వరకు 157 కోట్ల 13 లక్షల రూపాయలను విద్యుత్ సంస్థకు చెల్లించడం జరిగినది.
15. 1 వేయి 141 నూతన వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ లను 7 కోట్ల 98 లక్షల రూపాయల నిధులు ఖర్చు చేసి మంజూరు చేయడం జరిగింది.
16. ఇందిరమ్మ ఇండ్ల పథకం క్రింద జిల్లాలో 13 వేల 612 ఇండ్లు మంజూరు కాగా, 11 వేల 964 ఇండ్ల నిర్మాణం ప్రారంభించడం జరిగింది. ఇప్పటి వరకు లబ్ధిదారులకు 282 కోట్ల 67 లక్షల రూపాయలు చెల్లించడం జరిగింది.
17. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బోధన బలోపేతం చేయడానికి ప్రభుత్వం మన జిల్లాకు వివిధ రకాల పాఠశాలలను మంజూరు చేయడం జరిగింది. దానిలో భాగంగా జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి 1 చొప్పున తెలంగాణ పబ్లిక్ స్కూల్ కొరకు పరిపాలన అనుమతులు ఇవ్వడం జరిగింది.
18. జిల్లాలో 600 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 3 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ మంజూరు చేయడం జరిగింది.
19. రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం ద్వారా జిల్లాలో నిరుపేదలకు శస్త్ర చికిత్సలు మరియు చికిత్స గురించి గత ఆర్థిక సంవత్సరంలో 18 వేల 369 మందికి 50 కోట్ల 56 లక్షల రూపాయలు మరియు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 8 వేల 87 మందికి 23 కోట్ల 40 లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది.
20. 2026-27 సంవత్సరమునకు గాను 786 చెరువులలో 100% సబ్సిడీపై 2 కోట్ల 88 లక్షల చేప పిల్లలను విడుదల చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రక్రియ టెండర్ దశలో ఉంది.
21. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026 ప్రకారం గ్రామీణ ప్రజలకు 4-way చెత్త సేకరణపై ఇంటింటా అవగాహనకు ప్రత్యేక కార్యక్రమాలు గ్రామ పంచాయతీలలో నిర్వహించుటకు చర్యలు తీసుకోబడుచున్నవి. అందులో భాగంగా వ్యర్థాలను నాలుగు డస్ట్ బిన్ లలో వేరు చేయడానికి పంచాయతీ కార్యదర్శుల ద్వారా తగు చర్యలు తీసుకోబడుచున్నవి.
22. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసు శాఖ తీసుకున్న భద్రతా చర్యలు, కట్టుదిట్టమైన నిబంధనల అమలు చేయుట మరియు ప్రతి నెల Arrive-Alive రోడ్డు భద్రతా కార్యక్రమాలు విస్తృతంగా చేయడం వలన రోడ్డు ప్రమాదాలు మరియు మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది. Operation Kavach అనే వినూత్న కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి ప్రివెంటివ్ పోలిసింగ్ ద్వారా ప్రజలకు నమ్మకమైన రక్షణ కవచంగా పోలీసు శాఖ నిలిచింది.
ఈ కార్యక్రమంలో కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది, సాంస్కృతిక కళాకారులు తదితరులు పాల్గొన్నారు.








Post a Comment