బాన్సువాడలో రైస్ మిల్లర్ల నిరసన - తహసీల్దార్ కు వినతి
బకాయిల విడుదల, సమ్మెకు మద్దతుగా మెమోరండం
బాన్సువాడ, సెప్టెంబర్ 17: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైస్ మిల్లర్లు చేపట్టిన సమ్మెకు మద్దతుగా గురువారం బాన్సువాడ తహసీల్దార్ కు డివిజన్ రైస్ మిల్లర్లు వినతి పత్రం సమర్పించారు. తమకు రావాల్సిన బకాయిలు, తమ డిమాండ్లను వివరిస్తూ మెమోరాండం ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బాన్సువాడ డివిజన్ మిల్లర్స్ నాగుల గామ వెంకన్న గుప్తా, బెజుగం భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
రైస్ మిల్లర్ల ప్రధాన డిమాండ్లు:
రాష్ట్ర రైస్ మిల్లర్ల వెల్ఫేర్ అసోసియేషన్ ప్రకటించిన 13 ప్రధాన డిమాండ్లనే బాన్సువాడ మిల్లర్లు కూడా లేవనెత్తారు.
1. మిల్లులపై ఆకస్మిక దాడులు, విజిలెన్స్ తనిఖీల పేరుతో వేధింపులు ఆపాలి.
2. పెండింగ్ లో ఉన్న సివిల్ సప్లయిస్ బకాయిలు 2014 నుండి ఇప్పటి వరకు వెంటనే విడుదల చేయాలి.
3. కస్టమ్ మిల్లింగ్ రైస్ (CMR) విధానంలో శాస్త్రీయ పద్ధతిలో టెస్ట్ మిల్లింగ్ నిర్వహించి, ఖరీఫ్, రబీకి వేర్వేరు ప్రమాణాలు నిర్ణయించాలి.
4. మిల్లింగ్ చార్జీలు క్వింటాకు 150 రూపాయలకు పెంచాలి, పాత గన్నీ బ్యాగుకు 11 రూపాయలు ఇవ్వాలి.
5. పాత ఖాళీ బస్తాలను 10 రూపాయలకు, స్క్రాప్ బస్తాలను 5 రూపాయలకు ప్రభుత్వం తిరిగి తీసుకోవాలి.
6. డిఫాల్ట్ పై విధిస్తున్న 25 శాతం పెనాల్టీ, 12 శాతం వడ్డీని మాఫీ చేయాలి.
7. రబీ 2022-23 ధాన్యానికి గిట్టుబాటు ధర నిర్ణయించాలి, రైస్ రికవరీ శాతాన్ని సవరించాలి.
8. రైస్ మిల్లులకు వ్యవసాయ అనుబంధ పరిశ్రమ హోదా కల్పించి, 200 HP వరకు LT కరెంటు సౌకర్యం కల్పించాలి.
9. FCI ద్వారా నాణ్యత పేరుతో అధిక కోతలు విధించడం ఆపాలి, డ్యామేజ్, రంగు మారిన బియ్యం, నూకల శాతం 15-20% మినహాయింపు ఇవ్వాలి.
10. బాయిల్డ్ రైస్ విషయంలో ప్రభుత్వం స్పష్టమైన విధానం ప్రకటించాలి.
బకాయిలు విడుదల అయ్యే వరకు, తమ డిమాండ్లు పరిష్కరించే వరకు మిల్లులు తెరవబోమని, రాష్ట్ర అసోసియేషన్ పిలుపు మేరకు సమ్మె కొనసాగిస్తామని మిల్లర్లు తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ 12 నుండి మిల్లులు మూతపడ్డ నేపథ్యంలో బాన్సువాడ డివిజన్ లో కూడా అన్ని మిల్లులు బంద్ పాటిస్తున్నాయి.

Post a Comment