అంబేద్కర్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్న హమారా ప్రసాద్‌పై దేశద్రోహం కేసు పెట్టాలి : దళిత నాయకులు డిమాండ్
స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు - బాన్సువాడలో దళిత నాయకుల హెచ్చరిక
బాన్సువాడ, సెప్టెంబర్ 12: బాన్సువాడ పట్టణంలోని R&B గెస్ట్ హౌస్ లో శనివారం దళిత నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా దళిత నాయకులు అయ్యాల సంతోష్, మోచి గణేష్ మాట్లాడుతూ, హమారా ప్రసాద్ అనే కల్పిత వ్యక్తి భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి తప్పుడు మాటలు మాట్లాడుతూ, నిజాలను వక్రీకరించి సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.
హమారా ప్రసాద్ పై కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే దేశద్రోహం కేసు పెట్టి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణలోని SC, ST ఎమ్మెల్యేలు, మంత్రులు ఈ అంశంపై స్పందించాలని, లేని యెడల రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ఉద్యమాలు భారీ ఎత్తున నిర్వహిస్తామని హెచ్చరించారు.
బాబాసాహెబ్ అంబేద్కర్ అందరివాడని, అన్ని సామాజిక వర్గాలకు విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో రిజర్వేషన్లు, ఓటు హక్కు, మహిళలకు అన్ని రంగాల్లో అనేక హక్కులు కల్పించిన మహనీయుడని కొనియాడారు. అంబేద్కర్ చూపిన బాటలో నడవాలని, రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు.
ఈ కార్యక్రమంలో మోచి గణేష్, కంతి సాయిలు, గంగాధర్, విట్టల్, సంతోష్, గణేష్, దీపక్, వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment