Top News

Felicitation | టీయూడబ్ల్యూజే (ఐజేయూ) ఆధ్వర్యంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ కు సన్మానం

టీయూడబ్ల్యూజే (ఐజేయూ) ఆధ్వర్యంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ కు సన్మానం

బాన్సువాడ, సెప్టెంబర్ 08: టీయూడబ్ల్యూజే (ఐజేయూ) ఆధ్వర్యంలో మంగళవారం నాడు బాన్సువాడ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ ను ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా జర్నలిస్ట్ సంఘం నాయకులు మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని సదుపాయాలు అందుబాటులో ఉంచి పేదలకు నాణ్యమైన వైద్యం అందేలా చూడాలన్నారు.

అలాగే జర్నలిస్టుల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలని సూపరింటెండెంట్ కు విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా విభాగం జిల్లా కార్యదర్శి బైరి సుధాకర్ గౌడ్, టీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షుడు ఎండి యూనిస్ తదితరులు పాల్గొన్నారు.


ఫోటోలో: డాక్టర్ శ్రీనివాస్ కు శాలువా కప్పి సన్మానిస్తున్న జర్నలిస్ట్ నాయకులు.

Post a Comment

Previous Post Next Post