కామారెడ్డి జిల్లాలో నూతన ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ ప్రారంభం - ఇకపై FRS ద్వారానే హాజరు తప్పనిసరి
జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం ఆదేశాలు - ప్రభుత్వ జూనియర్ కళాశాలల సిబ్బందికి కీలక సూచనలు
కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నూతన ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ (FRS) ప్రారంభమైందని జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం తెలిపారు.
జిల్లాలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల టీచింగ్, నాన్-టీచింగ్ సిబ్బంది తప్పనిసరిగా FRS ద్వారానే హాజరు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు.
ప్రతి కళాశాల ప్రిన్సిపాల్ తమ కళాశాలలో పనిచేస్తున్న ప్రతి సిబ్బంది Staff Dataను Academic Moduleలో తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. Staff Entry పూర్తయిన అనంతరం సంబంధిత సిబ్బంది Approval ప్రక్రియను నోడల్ ఆఫీస్ సిబ్బందికి తెలియజేసి పూర్తి చేయించుకోవాలని సూచించారు.
FRSలో హాజరు నమోదు సమయంలో ఏవైనా సాంకేతిక సమస్యలు లేదా సందేహాలు తలెత్తితే జిల్లా రిసోర్స్ పర్సన్స్ బిచ్కుంద ప్రభుత్వ జూనియర్ కళాశాల సీనియర్ అసిస్టెంట్ సయ్యద్ అబ్దుల్ రజాక్, బాన్సువాడ జూనియర్ కళాశాల లెక్చరర్ వజాహత్ అలీలను సంప్రదించి సమస్యలను పరిష్కరించుకోవచ్చని తెలిపారు.
ప్రతి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో FRSను సమర్థవంతంగా అమలు చేస్తూ, సిబ్బంది మరియు విద్యార్థులు క్రమం తప్పకుండా FRSలో హాజరు నమోదు చేసేలా ప్రిన్సిపాల్స్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని షేక్ సలాం సూచించారు.

Post a Comment